Swathi Muthyam Movie Review : బెల్లంకొండ ఫ్యామిలీ గురించి తెలుసు కదా. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసి చాలా ఏళ్లు అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనకంటూ ఒక శైలిని, ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. కమర్షియల్ హీరోగా యాక్షన్, మాస్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బెల్లంకొండ సురేశ్ రెండో కొడుకు గణేష్ కూడా తాజాగా హీరోగా తెరంగేట్రం చేశాడు.
అదే స్వాతిముత్యం మూవీ. ఈ సినిమా దసరా కానుకగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సరోగసీ కోసం స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిస్థాయి కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. తెలుగు ఇండస్ట్రీకి కొత్త హీరో అయినప్పటికీ.. సినిమాలో కథ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం సినిమా ట్రైలర్, టీజర్లు చూసినప్పుడే ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. మరి.. బెల్లంకొండ గణేష్ ప్రేక్షకులను తన తొలి సినిమాతో ఆకట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాలి.
సినిమా పేరు : స్వాతిముత్యం
నటీనటులు : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, రావు రమేశ్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ
డైరెక్టర్ : లక్ష్మణ్ కే కృష్ణ
జానర్ : కామెడీ, ఫ్యామిలీ డ్రామా
రన్ టైమ్ : 2 గంటల 4 నిమిషాలు
విడుదల తేదీ : 5 అక్టోబర్ 2022
ఈ సినిమా కథ ఏపీలోని కాకినాడ, పిఠాపురంలో మొదలవుతుంది. బాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో జూనియర్ ఇంజనీర్. ఇంతకీ ఈ బాలు ఎవరంటారా? మన హీరో బెల్లంకొండ గణేష్. తను ఎవ్వరినీ పల్లెత్తు మాట అనడు. తన పని ఏంటో తాను చేసుకొని వెళ్తాడు. చాలా అమాయకుడు. అతడికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఓ పెళ్లి చూపుల్లో భాగ్యలక్ష్మి(వర్ష బొల్లమ్మ)ను చూస్తాడు. అప్పుడు తనకు ఆమె బాగా నచ్చుతుంది. తను ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో జాబ్ కు ఆఫర్ వచ్చినా తన ఫ్యామిలీ పంపించరు. దీంతో అదే గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. కనీసం పెళ్లి అయ్యాక అయినా ఉద్యోగం చేయాలని అనుకుంటుంది భాగ్యలక్ష్మి. కానీ.. బాలు ఫ్యామిలీ తను పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. దీంతో బాలును పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేస్తుంది భాగ్యలక్ష్మి. అయినప్పటికీ బాలు.. తనతో పెళ్లికి ఒప్పిస్తాడు. కానీ.. ఇంతలో శైలజ అనే ఓ యువతి బాలుకు పెళ్లికి ముందు ఫోన్ చేయడంతో కథ అంతా అడ్డం తిరుగుతుంది. అసలు శైలజ ఎవరు? శైలజకు, బాలుకు ఉన్న సంబందం ఏంటి? చివరకు భాగ్యలక్ష్మిని బాలు పెళ్లి చేసుకుంటాడా? అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ ; ఇది స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. నిజానికి.. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా డైరెక్టర్ కృష్ణ కూడా స్పెర్మ్ డొనేషన్ కథనే రాసుకున్నాడు. ఇక.. తొలి సినిమా అయినప్పటికీ బెల్లంకొండ గణేష్ బాగా నటించాడు. తన నటనకు ఎలాంటి వంకలు పెట్టాల్సిన అవసరం లేదు. అమాయకుడిలాంటి పాత్ర తనది. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం తన కుటుంబ సభ్యులను ఒప్పించే పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. మిగితా పాత్రలు కూడా తమ పాత్రల మేరకు నటించారు. మొత్తానికి ఈ సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సెకండ్ హాఫ్
కామెడీ
మైనస్ పాయింట్స్
సెన్సిటివ్ కాన్సెప్ట్
కన్ క్లూజన్
దితెలుగున్యూస్ రేటింగ్ : 2.75/5
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.