Tillu Square Movie Review : ప్రస్తుతం ఎగ్జామ్ సీజన్ నడుస్తుండడంతో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వారం ప్రేక్షకులని అలరించేందుకు టిల్లు స్క్వేర్ చిత్రం రెడీ అయింది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా, అనుపమ కథానాయికగా నటించింది. నాగ చైతన్య హీరోగా నటించిన ‘జోష్’ మూవీతో సిద్ధు హీరోగా పరిచయ్యాడు. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ మూవీలో తన యాక్టింగ్‌తో అదగొట్టాడు. మధ్యలో ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు 2022లో ఈయన రైటర్‌గా విమల్ కృష్ణ చేసిన ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా మంచి సక్సెస్ సాధించడంతో ఇప్పుడు టిల్లు ‘టిల్లు స్క్కేర్ సినిమాతో పలకరించబోతున్నాడు.
‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని నిర్మాత నాగవంశీ తెలియజేయగా,తాజా సమాచారం ప్రకారం ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా సాగుతుందట. సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ మరోసారి హైలెట్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ సీన్స్ ప్రేక్షకులకి మత్తెక్కించేలా ఉంటాయని అంటున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో మల్లిక్ రామ్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ కూడా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో హద్దులు దాటి సిద్దుకు తెగ ముద్దులు ఇచ్చేయడం సినిమాపై అంచనాలు పెంచింది.
చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్‌లో రొమాన్స్‌తో పాటు కామెడీ ప్లస్ యాక్షన్ అదుర్స్ అనేలా ఉంది. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ కుమ్మడం ఖాయం అని చెప్పాలి. ఇప్పటికే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీటై పిల్లలకు సెలవులు కూడా రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అదరగొట్టనుందని తెలుస్తుంది.
టిల్లు (సిద్దు) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. ఆమె ఒక పబ్‌లో అలా పరిచయమై.. మాయం అవుతుంది. నెల తర్వాత ఆమె గర్భవతి అని చెబుతుంది. అయితే ఆమె సడెన్‌గా కనిపించి ప్రగ్నెంట్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకవుతాడు. ఇక ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడడు. కాని టిల్లు బర్త్‌డేకి గతంలో ఎలాంటి షాకులు తగిలాయో అలానే తగులుతాయి. అయితే ఈ లిల్లీ ఎవరు? ఆమె ఇందుకు ఇతని జీవితంలోకి వచ్చింది, వీళ్ళ కథలోకి పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ)ఎందుకు వచ్చాడు అనేది చిత్ర కథ
సిద్ధూ, అనుపమ నటన
కెమిస్ట్రీ
కామెడీ సీన్స్
రొటీన్ కాన్సెప్ట్
ఊహజనితమైన సీన్స్
రొటీన్ క్లైమాక్స్
హిట్లైన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రంలో అందరు నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేశారు. సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. రామ్ మిర్యాల, అచ్చు సాంగ్స్ భీమ్స్ నేపథ్య గీతం సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలు ఎడిటింగ్ కూడా బాగుంది. దర్శకుడు మల్లిక్ రామ్ సినిమాని ఆసక్తికరంగా మలిచాడు. రచన బాగుంది. మల్లిక్ నరేషన్ బాగుంది. స్టోరీ కాస్త రొటీన్‌గానే ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పుష్కలం డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ క్రేజీ రైడ్ “టిల్లు స్క్వేర్” ఎవరికి బోర్ కొట్టించదు. ప్రేక్షకులకి మంచి వినోదం పంచడం ఖాయం.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.