Vakeel Saab USA Live Updates : వకీల్ సాబ్ మూవీ యూఎస్ లైవ్ అప్‌డేట్స్

vakeel saab Movie USA Live Updates :పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న రిలీజ్ కానుంది. కానీ… ఒక రోజు ముందుగానే అంటే ఈరోజు రాత్రి 11.30 నుంచే విదేశాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి.  ముందుగా ఫస్ట్ షో దుబాయ్ లో ప్రారంభం కాగా… ఆ తర్వాత యూఎస్ లో షో ప్రారంభం అయింది.అయితే… సినిమా ఇంకా పూర్తిగా ప్రసారం కాకముందే… ఫిలిం క్రిటిక్ ఓవర్సీస్ నుంచి తన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు… తన ట్విట్టర్ రివ్యూను ఇచ్చేశాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ ట్వీట్ చేశాడు. ఇది నేషనల్ అవార్డు విన్ అయ్యే సినిమా అంటూ చెప్పుకొచ్చాడు.పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలోనే ఇదొక మైలురాయి అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ వెండి తెర మీద కనిపిస్తున్న సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం అందరూ బాగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం నిద్రాహారాలు మాని… పవన్ అభిమానులు… థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Vakeel Saab Movie USA Live Updates

వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో… ఏపీలోని థియేటర్లలో టికెట్ల ధరలు పెంచడంతో…. మళ్లీ టికెట్ల ధరల పెంపును క్యాన్సిల్ చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో… పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చేశారు. చిన్న సినిమాలకు కూడా ఈరోజుల్లో టికెట్ల ధరలు పెంచుతుంటే… సీఎం జగన్ మాత్రం కావాలని తమ బాస్ పవన్ కళ్యాణ్ సినిమాకు టికెట్ల ధరలు పెరగకుండా అడ్డుకున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.

vakeel saab Movie USA Live Updates :

1 . సినిమా రన్ టైమ్ 154 నిమిషాలు. అంటే… రెండు గంటలా 34 నిమిషాలు. సినిమా స్టార్టింగే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్లతో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మొదటి సాంగ్… మగువా మగువా సాంగ్. 2. సినిమా ప్రారంభమే… నివేత థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇంట్రడక్షన్ తో ప్రారంభం అవుతుంది. అంటే.. సినిమాకు ముఖ్య పాత్రలైన ముగ్గురు హీరోయిన్ల గురించి ఒకేసారి డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 3. అయితే… ఈ ముగ్గురు హీరోయిన్లు పెద్ద ప్రమాదంలో పడతారు. ఇదే సినిమాకు అసలైన టర్నింగ్ పాయింట్. ఓ గ్రూప్ తో తగాదా పడటం వల్ల లేని సమస్యల్లో ముగ్గురూ ఇరుక్కుంటారు. ఇక్కడి నుంచి అసలు సినిమా ప్రారంభం అవుతుంది. 4. హీరోయిన్లు సమస్యల్లో చిక్కుకున్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. ఆయన ఇంట్రడక్షన్ సీను బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తున్నప్పుడు థమన్ కొట్టిన మ్యూజిక్ అదుర్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ కూడా చాలా స్టయిలిష్ గా ఉంటుంది. 5. ఆ ముగ్గురు హీరోయిన్ల సమస్యలను కాసేపు పక్కన పెట్టి.. పవన్ కళ్యాణ్ మీద డైరెక్టర్ దృష్టి పెట్టాడు. పవన్ కళ్యాణ్ సీన్లు చూస్తుంటే ఒరిజినల్ పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రకు ఏమాత్రం తగ్గలేదు అని అనిపిస్తుంది. 6. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. నివేథా థామస్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనను, తన ఫ్రెండ్స్ ను ఏడిపించిన రౌడీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే… పోలీసులు తననే అరెస్ట్ చేస్తారు.

7. ఇక పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన స్టయిల్, లాయర్ గా ఆయన ప్రవర్తించే తీరు, మాట్లాడే విధానం… ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అన్నీ సూపర్ గా సెట్ అయ్యాయి. 8. సమస్యల్లో చిక్కుకున్న ముగ్గురు హీరోయిన్లను పవన్ కళ్యాణ్ కలుస్తారు. వాళ్లకు జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన గతాన్ని వాళ్లకు చెబుతారు. అప్పుడే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది.9. సోషల్ ఇష్యూస్ గురించి ఈ సీన్లలో బాగా హైలెట్ చేశారు. ఆ తర్వాత రెండో సాంగ్ సత్యమేవ జయతే ప్లే అవుతుంది. ఈ సాంగ్ లోనే పవన్ కళ్యాణ్ లాయర్ ఎందుకు అయ్యారు? ఆయన లాయర్ కావడానికి దోహదం చేసిన అంశాలు ఏంటి? అనేది స్పష్టంగా చూపించారు.10. సాంగ్ అయిపోగానే… హీరోయిన్ శృతి హాసన్ ఎంట్రీ ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగే ప్రేమాయణం, పవన్ కళ్యాణ్, శృతి హాసన్ మధ్య రొమాంటిక్ సీన్లు కొన్ని ఉంటాయి. ఆ తర్వాత ఇద్దరి మీద కంటి పాప సాంగ్ ప్లే అవుతుంది. 11. అయితే… కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్… తన లా ప్రాక్టీస్ ను వదిలేస్తారు. లాయర్ ప్రాక్టీస్ చేయడం మానేస్తారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయన్ను లాయర్ ప్రాక్టీస్ ఆపేసేలా చేస్తాయి. దాంతో తన ప్లాష్ బ్యాక్ పూర్తవుతుంది. అయితే… నివేథ థామస్ కు బెయిల్ తీసుకురావడం కోసం అంజలి, అనన్య… పవన్ కళ్యాణ్ సహాయం కోరుతారు.

12. ఈ సినిమాకు ఇంటర్వెల్ బ్యాంగ్… పవన్ కళ్యాణ్ లాయర్ గా మళ్లీ తిరిగి రావడమే. అయితే.. నిస్సహాయక స్థితిలో ఉన్న నివేథా థామస్ ను రక్షించాలని… అంజలి, అనన్య పవన్ హెల్ప్ కోరడంతో తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్… మళ్లీ లాయర్ కోటు వేసుకుంటారు. అయితే… ఇంటర్వెల్ కంటే ముందు ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అది మాత్రం సినిమాకే హైలెట్. యాక్షన్ ఎపిసోడ్ తర్వాత పవన్ నల్ల కోటు వేసుకొని మళ్లీ లాయర్ అవతారం ఎత్తుతారు. అంతే… వెంటనే ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది.

13. సెకండ్ హాఫ్ :
సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే.. ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఉంటుంది. ప్రకాశ్ రాజ్ డిఫెన్స్ లాయర్. ఆయన రౌడీలకు చెందిన లాయర్. ముగ్గురు హీరోయిన్లను ఏడిపించిన వారి తరుపున ప్రకాశ్ రాజ్ కేసు వాదిస్తుంటారు. సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే.. కోర్టు సీన్లు ప్రారంభం అవుతాయి. అక్కడే ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ ఎదురుపడతారు. 14. ఎప్పుడైతే ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ ఎదురు పడుతారో… అప్పుడే సినిమాలోని అసలు స్టోరీ మొదలవుతుంది. కోర్టు ప్రారంభం కాగానే… ఇద్దరి మధ్య సీన్లు బాగానే పండాయి. న్యాయాన్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్… అన్యాయాన్ని కాపాడటం కోసం ప్రకాశ్ రాజ్… ఇద్దరూ బాగానే పోట్లాడారు. సెకండ్ హాఫ్ ప్రారంభం కాగానే…. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ సీన్స్ నడుస్తున్నాయి. ఇక… కోర్టులో హైలెట్ అంటే నివేథా థామస్ అనే చెప్పుకోవాలి. కోర్టు సీన్లలో స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. 15. మరో యాక్సన్ ఎపిసోడ్ కు సమయం వచ్చేసింది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, ఆయన మ్యానరిజం, ఆయన స్టయిల్… అన్నీ ఉపయోగించి యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. అలాగే… దీంట్లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. అది కూడా అనుకోకుండా జరుగుతుంది. 16. ఇలా కోర్టులో కథ సాగుతూ ఉంటుంది. పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే.. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? రౌడీల తరుపున వాదించే ప్రకాశ్ రాజా? లేక ఏపాపం తెలియని అమాయకురాలైన నివేథా థామస్ తరుపున వాదించే పవన్ కళ్యాణా? అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమాను వెండి తెరపై చూడాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం thetelugunews.com వెబ్ సైట్‌ను ఫాలో కండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago