vakeel saab USA premiere Shows : వకీల్ సాబ్ రిలీజ్ కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అది మన ఇండియాలో. కానీ ఈ పాటికే యూఎస్ ప్రీమియర్ షోస్ మొదలయ్యాట. మన పవర్ స్టార్ అభిమానులు..కామన్ ఆడియన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదని తెలుస్తోంది. ఇన్నేళ్ళలో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ స్టార్ హీరో సినిమా క్రియేట్ చేయని రికార్డ్స్ వకీల్ సాబ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ షోకి ఊహించని రేంజ్ లో వసూళ్ళు దక్కడం గొప్ప విషయం. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమాని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలన్న తపన…ఆతృత..ఆరాటం చిన్న వాళ్ల దగ్గర్నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిలో ఉంది.
ఈ క్రమంలో వకీల్ సాబ్ యూఎస్ లో వేసిన స్పెషల్ షోస్ చూడటానికి అభిమానుక్లు ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ పది రోజుల ముందు నుంచే పోటీ పడి చేసుకున్నారు. ప్రస్తుతం యూఎస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్క్రీన్స్ సరిపోవడం లేదట. రికార్డ్ స్థాయిలో 700 స్క్రీన్స్ లో వకీల్ సాబ్ రిలీజ్ అవడం విశేషం. అయితే ప్రీమియర్స్ షోస్ లో ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకి దక్కని కలెక్షన్స్ వకీల్ సాబ్ సాధించిందంటున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించగా తాప్సీ సహా మరో ముగ్గురు అమ్మాయిలు కీలక పాత్రల్లో కనిపించారు.
కాగా తెలుగులో కథా మాత్రమే తీసుకొని నేపథ్యం, స్క్రీన్ ప్లే మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గట్టు దర్శకుడు వేణు శ్రీరాం పలు మార్పులు చేశాడు. ఈ మార్పులే ఈ రేంజ్‌లో రికార్డ్స్ బ్రేక్ చేయడానికి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం అవుతున్నాయి. ఇక పింక్ సినిమా కోలీవుడ్ లో కూడా అజిత్ కుమార్ తో నేర్కొండ పార్వై గా బోనీకపూర్ నిర్మించాడు. హిందీ, తమిళ భాషల్లో 100 కోట్ల వసూళ్ళు రాబట్టగా తెలుగులో పవర్ స్టార్ వకీల్ సాబ్ ఎన్ని వందల కోట్లు రాబడుతుందో లెక్క తేలాలంటే ఇప్పుడే చెప్పడం అసాధ్యం అంటున్నారు. 2021 లో ఇప్పటి వరకు రిలీజైన సినిమాల పరంగా చూస్తే యూఎస్ ప్రీమియర్స్ లో 86 లొకేషన్స్ లో దాదాపు ఒక లక్ష 50 వేల డాలర్లు వసూళ్ళు రాబట్టిన ఒకే ఒక్క సినిమాగా వకీల్ సాబ్ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం విశేషం. యూఎస్ హైయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన వకీల్ సాబ్ ఇండియా వైడ్‌గా ఎంత రాబడుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.