Master Movie Review : విజయ్ కి భారీ హిట్.. కోలీవుడ్ రికార్డ్స్ అన్నిమాస్టర్ తో బద్దలైపోయాయి ..!

Authored By vamana sai | The Telugu News | Updated on: January 13, 2021, 8:52 am

మాస్టర్ సినిమా కోసం కోలీవుడ్ మొత్తం గత 8 నెలలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మాస్టర్ సినిమా విజయ్ కి ఛాలెంజింగ్ సినిమా. ఈ సినిమా విషయంలో ఎన్నో చర్చలు సాగాయి. అందరినీ ఎదురించి నిలబడ్డాడు. ఓటీటీ ఓత్తిడి చేసిన తలవంచలేదు. సూర్య లాంటి స్టార్ హీరో ఆకాశం నీ హద్దురా సినిమా కోసం థియేటర్స్ ఓపెన్ చేసేవరకు ఆగలేకపోయాడు. కాని విజయ్ మాత్రం ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసినా కూడా మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్సైయ్యాడు. మాస్టర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

Master Movie Review : విజయ్ కి భారీ హిట్.. కోలీవుడ్ రికార్డ్స్ అన్నిమాస్టర్ తో బద్దలైపోయాయి ..!

Master Movie Review : విజయ్ కి భారీ హిట్.. కోలీవుడ్ రికార్డ్స్ అన్నిమాస్టర్ తో బద్దలైపోయాయి ..!

దర్శకుడు లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మాస్టర్ సినిమా కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని .. థియేట్రికల్ ట్రైలర్ గాని రిలీజ్ కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల బిజినెస్ జరిగిందంటే బాక్సాఫీస్ వద్ద విజయ్ సత్తా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతకొంతకాలంగా విజయ్ చేసిన సినిమాలన్ని భారీ కమర్షియల్ సక్సస్ లను సాధిస్తూ కోలీవుడ్ స్టార్స్ హీరోలని వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కి చేరుకున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తో పోటీ పడుతున్నాడు విజయ్.

Master Movie Review : విజయ్ కి భారీ హిట్.. కోలీవుడ్ రికార్డ్స్ అన్నిమాస్టర్ తో బద్దలైపోయాయి ..!

Master Movie Review : విజయ్ కి భారీ హిట్.. కోలీవుడ్ రికార్డ్స్ అన్నిమాస్టర్ తో బద్దలైపోయాయి ..!

జిల్లా సినిమా నుంచి కత్తి, సర్కార్, తేరీ, మెర్సిల్, బిగిల్ వరకు.. ప్రతీ సినిమాతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటించిన మాస్ ఎంటర్‌టైనర్ మాస్టర్ సినిమా మీద అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా ఎట్టకేలకి మాస్టర్ సినిమా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. అయితే ఇప్పటికే జరిగిన బిజినెస్ పరంగా ఇప్పటి వరకు కోలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలైపోయాయని చెప్పుకుంటున్నారు. ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నమాస్టర్ తో విజయ్ ఇండస్ట్రీ హిట్ సాధించబోతున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుండగా తెలుగులోనే 160 స్క్రీన్స్ లో ప్రదర్శనకి రెడీ అయింది.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp