Funky Movie First Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 9 February 2026, 7:40 pm
  •  Funky Movie First Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!

  •  వాలెంటైన్స్ వీక్‌లో సినిమాల‌ సందడి.. కొత్త సినిమాల‌తో థియేట‌ర్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

Funky Movie First Review  :  ప్రేమికుల రోజు  valentine day సందర్భంగా ఈ వారం సినీ అభిమానులకు థియేటర్లు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా పలు క్రేజీ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండగా, కొన్ని హిట్ ప్రేమకథా చిత్రాలు రీ–రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి.వాలెంటైన్స్ డేకు ముందుగానే ప్రేమికుల్ని అలరించేందుకు ఫిబ్రవరి 13న Vishwak Sen విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ విడుదల కానుంది. అనుదీప్ కెవీ దర్శకత్వంలో రూపొందిన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నవ్వులతో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

Funky Movie Frist Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!

Funky Movie Frist Review : విశ్వక్ సేన్ ఫంకీ మూవీ ఫస్ట్ రివ్యూ..!

Funky Movie First Review  సంద‌డే సంద‌డి..

క్రైమ్–హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘అమరావతికి ఆహ్వానం’ కూడా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జీవీకే దర్శకత్వం వహించారు. ట్రైలర్‌లో కనిపించిన మిస్టరీ ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తి పెంచాయి. చిన్న సినిమాగా వచ్చినా ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు పొందాలని చూస్తున్న చిత్రం ‘స్కై’. మురళీ కృష్ణంరాజు, శ్రుతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కూడా ఇదే వారం రిలీజ్ అవుతోంది. కొత్త సంగీత దర్శకుడు శివప్రసాద్ ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘చథా పచ్చ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో సిద్ధమైంది.

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజున విడుదల కానున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించారు. యూత్‌ను టార్గెట్ చేసిన ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతా పయనం’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. అర్జున్ ప్రధాన పాత్రలో నటించగా, ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా కనిపించనుంది. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రెండు హిట్ ప్రేమకథా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్నాయి. నాగచైతన్య–సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఫిబ్రవరి 14న రీ–రిలీజ్ అవుతుండగా, ఉదయ్ కిరణ్ క్లాసిక్ హిట్ ‘మనసంతా నువ్వే’ కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు లవర్స్‌కు స్పెషల్ ట్రీట్‌గా నిలవనున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp