
IPL 2024 : ఐపీఎల్‌లో అతని గురించే అందరిలో టెన్షన్.. అతనిని ఆపే మగాడెవరు లేరా..?
IPL 2024 : మరి కొద్ది రోజులలో ఐపీఎల్ జరగనుండగా, ఈ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 2008లో క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ఐపీఎల్ . అనతి కాలంలోనే గుర్తింపుపొందింది. ఈ లీగ్ రాకతో అభిమానులు క్రికెట్‌ను చూసే కోణమే పూర్తిగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ స్పూర్తిగా ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక దేశాలలో ఈ తరహా లీగ్ సూపర్భ్ గా నడుస్తుంది. ఈ లీగ్‌లలో ఆడితే ఆర్థికంగా సెటిల్ అవ్వొచ్చని మరికొందరు ప్లేయర్లు భావిస్తున్నారు. అయితే ఈ లీగ్ ద్వారా ఎంతో మంది క్రికెటర్స్ వెలుగులోకి వచ్చారు. వారిలో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఒకరు. ఆయన గ్రౌండ్‌లో ఉంటే ఎంత భీబత్సం సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మొత్తం 10 జట్లలో 9 టీమ్స్ మ్యాక్స్‌వెల్ అరాచకానికి భయపడుతున్నాయి. అతనిని ఔట్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. కొన్ని టీమ్స్‌కు రోహిత్, మరికొన్ని టీమ్స్‌కు సూర్యకుమార్ టార్గెట్‌గా ఉంటే ఆర్సీబీతో ఆడేప్పుడు అందరికి కామన్‌గా మ్యాక్స్‌వెల్ టార్గెట్ అయ్యాడు. అతని ఊచకోతకి భయపడి ప్రతి ఒక్క బౌలర్ గుండెలలో వణుకు మొదలైంది. ఐపీఎల్ టీమ్స్.. అన్ని కూడా ప్రత్యేక స్కెచ్‌తో బరిలోకి దిగాల్సిందే అని ఇప్పటికే ఓ ప్రణాళిక రచించాయి. ఐదు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల మ్యాక్స్‌వెల్ ఎన్నో సార్లు అద్భుతమైన షాట్స్ ఆడి గెలిపించాడు. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒంటి చేత్తో ఆడి మ్యాచ్ గెలిపించాడు.
పూనకం పూనినట్టు గ్రౌండ్ నలువైపులా షాట్స్ ఆడి ఆసీస్‌కి మంచి విజయం అందించాడు. అతను ఆడకపోయి ఉంటే వరల్డ్ కప్ మన చేతికి పక్కా వచ్చేది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ మ్యాక్సీ అద్భుతమైన ఆట ఆడగలడు. అందరి మాదిరిగా కాకుండా తనకంటూ సొంత స్టైల్‌తో బ్యాటింగ్ చేస్తాడు. ఇక బౌలింగ్‌తోను అద్భుతాలు చేయగల టాలెంట్ మ్యాక్స్ వెల్‌లో ఉంది. కష్టమైన పిచ్‌లపై విధ్వంసం సృష్టించే మ్యాక్సీ ఐపీఎల్‌లో ఇండియా పిచ్‌లపై మరిన్ని పరుగులు రాబట్టడం ఖాయం అంటున్నారు. వరల్డ్ కప్ నుంచి మ్యాక్సీ ఉన్న ఫామ్ చూస్తుంటే.. ఈ సారి ఐపీఎల్‌లో కూడా దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.