
RBI : గుడ్‌న్యూస్.. క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆర్బీఐ కొత్త రూల్స్.. బిల్స్ ఎప్పుడు, ఎలా కట్టాలి అంటే..!
RBI : ఈ రోజుల్లో చాలా మంది క్రెడిట్ కార్డ్ వాడుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. క్రెడిట్ కార్డ్ సాధారణ, మధ్య తరగతి వారికి చాలా ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డ్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లయితే క్రెడిట్ స్కోరు కూడా బాగానే ఉంది. క్రెడిట్ కార్డ్ వాడిన వారు సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే క్రెడిట్ కార్డ్ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల పలు కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2022 ఏప్రిల్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురాగా, ఆ రూల్స్ ప్రకారం ఎవరైన సరే తమ క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకసారి మార్చుకోవడానికి మాత్రమే బ్యాంకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పటి రూల్ ప్రకారం ఆర్బీఐ పలు మార్పులు చేసింది.
క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆర్బీఐ పలు రూల్స్ జారీ చేసింది. గతంలో బిల్లింగ్ సైకిల్ వ్యవధి 28 నుండి 32 రోజుల వరకు ఉండగా, ఆ బిల్లింగ్ సైకిల్ అనేది ఎప్పుడు క్రెడిట్ కార్డ్ యాక్టివ్ అయితే అప్పటి నుండి మొదలవుతుంది. అయితే స్టేట్‌మెంట్ జనరేట్ అయిన తర్వాత బిల్లు చెల్లించడానికి పది నుండి పదిహేను రోజుల సమయం ఉంటుంది కాబట్టి 30-రోజుల బిల్లింగ్ సైకిల్, గడువు తేదీ వరకున్న 10-15 రోజులు కలిపి 45 రోజులు మొత్తం ఫ్రీ పిరియడ్ పొందుతారు. మీరు ప్రతి నెలా 1వ తేదీ, 10వ తేదీ మధ్య క్రెడిట్ కార్డు వాడినట్టైతే , 25వ తేదీ తర్వాత స్టేట్‌మెంట్ తేదీని అడ్జెస్ట్ చేస్తారు. అప్పుడు మీకు గడువు తేదిని వచ్చే నెల 10 నుండి 15 వరకు ఉంటంది.
దీని వలన వినియోగదారుడికి చాలా లాభం ఉంటుంది. క్రెడిట్ కార్డుల్లో ఎంత మొత్తం వాడుకోవచ్చనే దానిపై కూడా ఒకప్పుడు కొంత లిమిట్ ఉంటుంది. కస్టమర్ల అనుమతితో దానికి మించి వాడుకునే ఆప్షన్ సంస్థలు ఇప్పుడు ఇవ్వొచ్చు అనే నిబంధన కూడా తీసుకు వచ్చారు. ఒక వేళ కస్టమర్‌కి ఇష్టం లేదంటే దానిని డియాక్టివేట్ చేయవచ్చు. కస్టమర్‌కు తెలియకుండా అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం ఏమాత్రం చేయవద్దు. ఇక క్రెడిట్ కార్డుల్ని బ్లాక్ లేదా డీయాక్టివేషన్ చేసినట్లయితే వాడేటందుకు ఏ మాత్రం కుదరదు. మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే 7 రోజుల్లోగా సంస్థలు ఖాతా మూసేయాల్సి న పరిస్థితి నెలకొని ఉంటుంది.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.