Home » News » Astrology Venu Swamy Predicts The Srh Winning In Ipl 2024
News

Venu Swamy : ఐపీఎల్ పై వేణు స్వామి జాతకం… ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 12, 2024, 7:00 pm
Advertisement

Venu Swamy  : వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కచ్చితంగా వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటుంది. అయితే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుల జాతకాలు మరియు సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే వేణు స్వామి తాజాగా క్రీడా రంగంపై కూడా తన జాతకాలను చెప్పడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హైదరాబాద్ జట్టు అనేది లిస్టులో లేని ఒక జట్టు. కావ్య మారన్ జాతకంలో దోషాలు ఉన్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ వెనకబడిందని వేణు స్వామి తెలిపారు.

Advertisement

Venu Swamy అభిషేక్ శర్మను ఎవరు ఆపలేరు…

కానీ ప్రస్తుతం కావ్య మారన్ జాతకంలో మంచి యోగం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆమెది పై చేయి అవుతుందని వేణు స్వామి తెలిపారు. ఆమెది మిధున రాశి కావడంతో దానికి సంబంధించి పురోగతి లభించిందని వేణు స్వామి తెలిపారు. ఇక ఆమె జాతకానికి తగ్గట్టుగానే నేడు హైదరాబాద్ జట్టు కూడా బాగా రాణిస్తుందని వేణు స్వామి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే మంచి మంచి జట్లపై కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందని వేణు స్వామి తెలిపారు. ఇక ఈ జట్టులో అభిషేక్ శర్మ అనే వ్యక్తి 15 – 16 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ కొట్టేస్తున్నాడు. అతను స్టేడియంలో బ్యాట్ పట్టుకుని దిగిన తర్వాత అతనిని ఆపే శక్తి ఎవరికీ లేదంటూ వేణు స్వామి తెలిపారు. అభిషేక్ శర్మ అనే వ్యక్తి బ్యాట్ పట్టుకుని బరిలో దిగిన తర్వాత తన బ్యాట్ తో అతను విజృంభించకుండా , అతనికి పేరు రాకుండా ఆపే శక్తి ఐపీఎల్ టీమ్ లో ఎవరికి లేదంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలిపారు.

Venu Swamy : ఐపీఎల్ పై వేణు స్వామి జాతకం… ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్…!

Advertisement

ఈ నేపథ్యంలోనే జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం అని , ఈ శాస్త్రం ద్వారా ముందుగానే జరగబోయేటువంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ ,జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకువస్తూ అలాగే నా పేరును అందరికీ తెలిసేలా చేసుకొనేటువంటి వ్యవహారమని వేణు స్వామి తెలిపారు. అయితే వేణు స్వామి ఇలా చెప్పిండు అని వేణు స్వామిని టార్గెట్ చేయడం వలన లేదా వేణు స్వామిని ట్రోలింగ్ చేయడం వలన రాబోయే రోజుల్లో ఎవరు ఆపలేరు కదా అంటూ వేణు స్వామి తెలిపారు. ఎవరు ఏం చేసినా సరే జరగబోయేదైతే ఎవరు ఆపలేరు కదా దానికి నన్ను ట్రోలింగ్ చేయడం వలన కలిగే ప్రయోజనం ఏంటంటూ వేణు స్వామి ఆందోళన వ్యక్తం చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి