Ac : వేసవికాలంలో విపరీతంగా మండుతున్న ఎండల కారణంగా ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాన్ గాలి కూడా సరిపోవడం లేదు. దీంతో చాలామంది ఏసీ కింద ఉండేందుకే ఇష్టపడుతుంటారు. కానీ ఈ ఏసీ లను ఎక్కువ వినియోగించడం వలన కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే . ఇక ఈ కరెంట్ బిల్లుకు భయపడి చాలామంది ఏసీ ని కొనలేకపోతున్నారు. మరి కొంతమంది ధైర్యం చేసి కొన్నప్పటికీ వస్తున్న కరెంట్ బిల్లుకు చూసి షాక్ అవుతున్నారు. అయితే మీరు ఏసిని ఉపయోగిస్తున్నా కూడా కరెంట్ బిల్లు తక్కువగా రావాలంటే ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటించాలి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఏసీ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అలాగే 20 – 24 డిగ్రీల స్థిరమైన టెంపరేచర్ లో మాత్రమే ఏసీ ను వినియోగించండి. అదేవిధంగా ఏసీను ఆఫ్ చేయడానికి కూడా టైమర్ ఉపయోగించడం మంచిది. ఈ విధంగా మీరు మీ యొక్క ఎయిర్ కండిషనర్ ను సమర్థవంతంగా వినియోగించడం వలన కరెంట్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.
ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం వలన గది త్వరగా చల్లబడుతుందని అందరికీ తెలుసు. కానీ ఏసీని 24 డిగ్రీల సెల్సియస్ కు సెట్ చేసుకొని వినియోగించడం వలన కరెంట్ బిల్లు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మానవ శరీరానికి కూడా ఇది మరింత అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఏసీ టెంపరేచర్ ను తగ్గించే కొద్ది మీ విద్యుత్ వినియోగం అనేది విపరీతంగా పెరుగుతూ పోతుంది.ఒక్క డిగ్రీ తగ్గించితే 6 శాతం విద్యుత్ బిల్లు పెరుగుతుంది కాబట్టి మీరు కరెంట్ బిల్లును ఆదా చేసుకోవాలనుకుంటే ఏసీ టెంపరేచర్ ను కచ్చితంగా 20 – 24 డిగ్రీల వద్ద ఉంచడం మంచిది. ఈ విధంగా చేయడం వలన ఏసీ కు మెరుగైన సామర్థ్యం అందించడంతోపాటు తక్కువ కరెంట్ బిల్ వస్తుంది.
ఏసీలను సీజన్ లో కనీసం 1 లేదా 2 సార్లు శుభ్రం చేయించడం మంచిది. వాస్తవానికి సంవత్సరంలో ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేసినప్పటికీ కాలుష్యం కారణంగా ఫిల్టర్లు దుమ్ముతో నిండిపోతాయి. దీని కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సీజన్ లో కనీసం రెండు సార్లు అయినా సాంకేతిక నిపుణుల సహాయంతో మీ యొక్క ఏసీ ను శుభ్రం చేయించుకోవడం మంచిది.
మీరు ఇంట్లో ఏసీ ని ఆన్ లో ఉంచినప్పుడు కచ్చితంగా కిటికీలు తలుపులు మూసి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గదిలోని గాలి బయటకు వెళ్లకుండా ఉండటం ద్వారా గది త్వరగా చల్లబడుతుంది. అలాకాకుండా తలుపులు తీసి ఉంచితే మీ ఏసి రూమ్ టెంపరేచర్ ను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. తద్వారా విద్యుత్ వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఏసీ ఉపయోగంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తలుపులు కిటికీలు మూసివేసి ఉంచండి.
సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయండి…
ఎలాగో ఏసీ వేసుకున్నాము కదా అని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయకుండా ఉంటున్నారా. ఈ విధంగా అస్సలు చేయకండి. మీ గదిలో గాలి ప్రసరణ పెంచడానికి శీతలీకరణ ప్రక్రియ నియంత్రించడానికి సీలింగ్ ఫ్యాన్ ముఖ్యపాత్ర వహిస్తుంది. అంతేకాక ఇది ఏసీ సామర్థ్యాన్ని పెంచి కరెంట్ బిల్లును ఆదా చేస్తుంది. కావున ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు కచ్చితంగా కావున సీలింగ్ ఫ్యాన్ ఆన్ లో ఉంచండి. ఈ సాధారణ చిట్కాలు వినియోగించడం వలన మీరు ఇంట్లో ఏసీ వాడుతున్నప్పటికీ విద్యుత్ బిల్లును తక్కువగా వచ్చేలా చేసుకోవచ్చు. అంతేకాక మీ యొక్క ఏసీ పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడుతుంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.