BCCI will not select Suryakumar Yadav for ODIs
Suryakumar Yadav : ఇటీవలి కాలంలో సూర్య కుమార్ యాదవ్ పేరు తెగ మారు మ్రోగిపోతున్న విషయం తెలిసిందే.అందుకు కారణం సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడమే. అతని బ్యాటింగ్ చూస్తే ఎవరైన ఆశ్చర్యపోవడం ఖాయం. కొన్ని కొన్ని షాట్లు సూర్యకుమార్ ఎలా కొడతాడో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. సూర్య బ్యాటింగ్ చూస్తుంటే అతను ఏ గ్రహం నుంచి వచ్చాడో కూడా ఒక్కోసారి అర్థం కాదని పలువురు మాజీలు కూడా చెప్పుకొచ్చారు. అయితే టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను వన్డేలతో పాటు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఆడించకూడదనే యోచనలో బీసీసీఐ ఉందని తెలుస్తోంది.
సూర్యకుమార్ యాదవ్ సైతం టెస్టు, వన్డే క్రికెట్ ఆడాలనే కోరికను వెల్లబుచ్చాడు. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన తొలి రోజుల్లో అందరిలాగే తాను కూడా ముంబై తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడిన విషయాన్ని సూర్య గుర్తు చేసుకున్న సూర్య… టెస్టు క్రికెట్‌ను సైతం తాను ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ జట్టులో రెండు మార్పులు చేస్తూ.. రవీంద్ర జడేజా, దయాల్ స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్‌లను జట్టులోకి తీసుకున్నారు. కానీ సూర్యకుమార్ యాదవ్‌కు, సంజు శాంసన్‌కు మాత్రం మొండి చేయి చూపించారు. ఈ విషయంపైనే క్రికెట్ అభిమానులు తెగ మండిపడుతున్నారు.
BCCI will not select Suryakumar Yadav for ODIs
బీసీసీఐలో కులతత్వం రాజ్యమేలుతుందని.. అందుకే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్‌లకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించిన తర్వాత.. ‘క్యాస్టిస్ట్ బీసీసీఐ’ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. జట్టులో బ్రాహ్మణులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని క్రికెట్ అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. సంజూ శాంసన్, సూర్య కుమార్‌కి మంచి టాలెంట్ ఉన్నా కూడా రెస్ట్ పేరుతో వారిని ప్రతి సారి తొక్కేస్తున్నారని కుల గజ్జి ఎప్పుడు వదులుతుందో అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై బీసీసీఐ స్పందిస్తుందా అనేది చూడాలి.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.