#image_title
Ind VS Pak : ప్రస్తుతం అందరూ ఐసీసీ వరల్డ్ కప్ మీదనే దృష్టి సారించారు. ఈ వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో టైటిల్ ఫేవరేట్ గా భారత్ బరిలోకి దిగుతోంది. అయితే.. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో జరిగిన ప్రతి మ్యాచ్ లో గెలుస్తూ భారత్ సత్తా చాటుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటింది. ఆ తర్వత ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లోనూ గెలిచి తిరుగులేదనిపించింది. ఇక.. మూడో మ్యాచ్ పాకిస్థాన్ తో అక్టోబర్ 14న జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలవడంతో.. భారత్ కు నాలుగు పాయింట్లు వచ్చాయి. ఈ నెల 14న పాకిస్థాన్ తో అహ్మదాబాద్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అటు భారత్ కు, ఇటు పాక్ కు కూడా కీలకమే.
నిజానికి భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే అది మామూలుగా ఉండదు. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ ను తిలకిస్తుంది. దానికి కారణం.. పాకిస్థాన్ భారత్ కు చిరకాల ప్రత్యర్థి కావడం. 1992 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో పాకిస్థాన్ భారత్ పై గెలవలేదు. అందుకే ఈసారి గెలిచి తమ సత్తా చాటాలని పాకిస్థాన్ కూడా జోరుగా ప్లాన్ వేస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ మ్యాచ్ కి బెట్టింగ్ కోట్లలో జరుగుతోందట. ఇప్పటికే పాకిస్థాన్ కూడా రెండు మ్యాచ్ లలో గెలిచి నాలుగు పాయింట్స్ సాధించింది. ఇండియా కూడా నాలుగు పాయింట్స్ సాధించింది. కానీ.. భారత్ కు ఎక్కువ రన్ రేట్ ఉంది. దీంతో భారత్ ప్రస్తుతం వరల్డ్ కప్ లో రెండో ప్లేస్ లో ఉండగా.. పాక్ మూడో ప్లేస్ లో ఉంది. ఇక.. భారత్, పాక్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్లు టాప్ లోకి వెళ్తారు.
#image_title
ఇదంతా పక్కన పెడితే.. భారత్, పాక్ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాజులు పండుగ చేసుకుంటున్నారు. వేల కోట్ల బెట్టింగ్ జరుగుతోందట. ఏ జట్టు గెలుస్తుందోనని ముందే ఊహించి బెట్టింగ్స్ కాస్తున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. కోట్లలో ఈ మ్యాచ్ పై బెట్టింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆసియా కప్ లో పాకిస్థాన్ ను భారత్ ఓడించింది. వరల్డ్ కప్ లోనూ ఓడించి తమ సత్తాను భారత్ చాటుతుందా? లేదా? అనేది తెలియాలంటే ఇంకో రోజు వెయిట్ చేయాల్సిందే.
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది…
Vastu Tips : హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రం ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా నిలిచింది. ఇల్లు నిర్మించేటప్పుడు, శుభశాంతులు, ఆరోగ్యం,…
Sleeping : మన ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఆహారం కూడా, నిద్ర కూడా అత్యంత కీలకమైన అంశాలు. సరైన సమయంలో తినడం,…
Raksha Bandhan : ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకునే రాఖీ పండుగ (రక్షాబంధన్) భారతీయ సాంప్రదాయంలో సోదరుడు…
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
This website uses cookies.