
Virat Kohli Gives The Retirement
Virat Kohli : ఇండియన్ స్టార్ క్రికెటర్స్‌లో విరాట్ కోహ్లీ ఒకరు. ఆయన ఒకప్పుడు బ్యాట్ చేత పట్టాడంటే బౌలర్స్ గుండెలలో వణుకు పుట్టడం ఖాయం. కాని ఇప్పుడు పరిస్థితులు బాగా మారాయి. కోహ్లీ ఫామ్ లేమితో చాలా తంటాలు పడుతున్నాడు. అయితే కోహ్లీ స్టార్ క్రికెటర్‌గా మారిన తర్వాత ఆయన చాలా యాడ్స్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాపార ప్రకటనలు ఇప్పుడు ఆగిపోనున్నట్టు తెలుస్తుంది. విరాట్ కోహ్లి నటించిన వ్యాపార ప్రకటనలను వివో మొబైల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఆ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించడంతో ఈ వ్యాపార ప్రకటనలు నిలిపివేసినట్టు ఆ కంపెనీ అధికారులు తెలిపారు.
కోహ్లీకి కష్టాలు..
మనీ లాండరింగ్ ఆరోపణలకు వ్యతిరేకంగా వివో కంపెనీపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఈ చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణ పూర్తయ్యేంత వరకు ఈ సోషల్ మీడియా, టెలివిజన్ వ్యాపార ప్రకటనలను నిలిపివేస్తున్నట్టు తెలిసింది. ఈ సమయంలో వ్యాపార ప్రకటన చేసేందుకు విరాట్ కోహ్లి కూడా అసౌకర్యంగా భావిస్తున్నారని మరో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఈ ప్రకటనలు నిలిపివేయడంతో ఈ కంపెనీ ఎదుర్కొనే విమర్శల నుంచి విరాట్ కోహ్లిని కాపాడినట్టవుతుందని ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
break for virat kohli ads
మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తమపై తీసుకున్న చర్యలపై వివో కంపెనీ ఢిల్లీ హైకోర్టుకి ఎక్కింది. మనీ లాండరింగ్ విచారణలో భాగంగా కంపెనీకి చెందిన 199 బ్యాంకు అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇదిలా ఉంటే కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ ఆడుతున్నాడు. రెండో టీ 20 లో కోహ్లీ ఔటయిన దాని కంటే.. ఔటైన తీరే అతను ఎంతటి వరస్ట్ స్టేజీలో ఉన్నాడో చెబుతుంది. కవర్ డ్రైవ్ ఆడాల్సిన బంతిని.. నిర్లక్షకరంగా హిట్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో కోహ్లీని తప్పించాలని లేకుంటే కోహ్లీయే స్వతాహగా తప్పుకుని ఫామ్‌లో ఉన్నవాళ్లకు ఛాయిస్ ఇవ్వాలంటూ నెట్టింట కామెంట్లు హోరెత్తుతున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.