MS Dhoni : మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై కొన్నాళ్లుగా అనేక ప్రచారాలు జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ నుంచి ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అని చర్చ నడుస్తూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. లీగ్ చరిత్రలోనే విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు 15 సీజన్లలో ఆడింది. అందులో ఈ సీజన్‌తో కలిపి కేవలం మూడు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. 12 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది.
ఇక ఈ సీజన్‌లో కీలకమ్యాచులో బెంగళూరు చేతిలో ఓడిన సీఎస్కే.. నిష్క్రమించక తప్పలేదు. అయితే ఈ సీజన్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వచ్చాయి. చెపాక్ వేదికగా జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచు అనంతరం ఫ్యాన్స్ ఎవరూ కూడా స్టేడియాన్ని వదిలి వెళ్లకూడదని సీఎస్కే కోరింది. దీంతో ధోనీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాడా అని అందరూ భావించారు. కానీ స్టేడియంలో తిరిగిన సీఎస్కే జట్టు సభ్యులు.. ఫ్యాన్స్‌కు బంతులను గిఫ్ట్‌లుగా అందజేశారు. ఇక ఆర్సీబీతో మ్యాచులో గెలిచి ప్లే ఆఫ్స్ చేరి.. మరోసారి సీఎస్కే ఛాంపియన్‌గా నిలుస్తుందని.. ఆ జట్టు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ అదీ జరగలేదు. ఆర్సీబీ చేతిలో ఓడి సీఎస్కే ఇంటిబాట పట్టింది. దీంతో ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజాగా ఈ వార్తలపై సీఎస్కే అధికారి ఒకరు స్పందించారు. ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి ఎవరికీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు.ధోనీ తన రిటైర్‌మెంట్ గురించి సీఎస్కే ఫ్రాంచైజీలో ఎవరికీ చెప్పలేదు. రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు నెలల సమయం వేచి ఉంటానని మేనేజ్‌మెంట్‌తో దోనీ చెప్పాడు’’ అని ఆ సీఎస్కే అధికారి వెల్లడించారు. అంతేకాదు.. ధోనీలో ఎనర్జీ ఇంకా తగ్గలేదని, వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఎలాంటి అసౌకర్యాన్ని అతను చవిచూడటం లేదని, ఇది ఒక ప్లస్ పాయింట్ అని ఆయన తెలిపారు. ధోనీ నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని.. జట్టు ప్రయోజనాలను గురించే అతను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడని అన్నారు. మొత్తానికి.. ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్‌మెంట్ ఇవ్వడని క్లారిటీ వచ్చేసినట్లే. తదుపరి సీజన్‌లోనూ అతడు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.