Deepak Hooda : వరల్డ్ కప్ 2022లో నిరాశ పరచిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్న వియం తెలిసిందే. తొలి టీ 20 వర్షం కారణంగా ఆగిపోగా, రెండో టీ 20 లో భారత్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్, అద్భుతమైన బ్యాటింగ్‌కి తోడు దీపక్ హుడా సూపర్ బౌలింగ్‌తో ఇండియా సునాయాసంగా గెలిచింది. తో ఆదివారం జరిగిన రెండో టీ20లో 4 వికెట్లు తీసిన హుడా భారత విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు వేసిన దీపక్ హుడా 4 వికెట్లు తీసి 10 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. టీ20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన తొలి బౌలర్‌గా చరిత్ర కూడా సృష్టించాడు.
దీపక్ తన చివరి ఓవర్‌లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీయగా, హ్యాట్రిక్ అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 19వ ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం అందుకున్న దీపక్ హుడా.. రెండో బంతికి ఇష్ సోదీ, మూడో బంతికి టీమ్ సౌథీని ఔట్ చేసి హ్యాట్రిక్ తీస్తాడేమో అని అనుకున్నారు. కానీ హ్యాట్రిక్ బాల్‌ను ఫెర్గూసన్ సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిల్నేను ఔట్ చేసిన హుడా న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. కొన్నాళ్లుగా టీమిండియాని వేధిస్తున్న ఇన్నింగ్స్ 19వ ఓవర్ హుడా అందుకోవడం అందుకు న్యాయం చేయడం విశేషం. వరల్డ్ కప్‌కి ఎంపికైన దీపక్ హుడా, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో తిరిగి అవకాశం దక్కలేదు.
వరల్డ్ కప్‌లో అక్షర్ పటేల్ ,అశ్విన్ బదులు దీపక్ హుడా లాంటి పార్ట్ టైమ్ బౌలర్‌ని ఆడించి ఉన్నా, టీమిండియాకి ఈ ఘోర పరాజయం తప్పి ఉండేదని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా దీపక్ గొప్పగా బౌలింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. . న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(3/34) హ్యాట్రిక్ వికెట్ సాధించగా.. లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీసాడు. అనంతరం న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.