Chiranjeevi- Sridevi : సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన స్థానం ఉందనే సంగతి తెలిసిందే. వారిద్దరికి మంచి స్టార్‌డం ఉండగా, ఇద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమనే అభిప్రాయం అందరిలో ఉండేది. స్టార్ హీరోలు సైతం శ్రీదేవి తమ సినిమాల్లో కచ్చితంగా ఉండాలని రికమండే చేసి మరి దర్శకులపై ఒత్తిడి చేసేవారు. అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్ – ఏఎన్నార్ – సూపర్ స్టార్ కృష్ణ, చంద్రమోహన్, కృష్ణంరాజు ఇలా అందరితోనూ శ్రీదేవి నటించిన సూపర్ హిట్లు కోట్టారు.
తర్వాత తరం హీరోలుగా అయిన చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ పక్కన కూడా శ్రీదేవి జత కట్టింది శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంటర్ అయిందో అక్కడ నుంచి ఆమె రేంజ్ పెరిగింది. బాలీవుడ్లోకి వెళ్ళాక శ్రీదేవి దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఈ అమ్మడు అంతగా ఆసక్తి చూపించలేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేసే క్రమంలో ఆమెకు ఇగో సమస్య అడ్డు వచ్చిందట. ఇది శ్రీదేవి సొంత సినిమా కాగా, తన తల్లిని నిర్మాతగా పెట్టి శ్రీలత మూవీస్ బ్యానర్ పై కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా తీయాలని డిసైడ్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి హీరో. కాగా, యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించారు. అయితే ఈ సినిమా కోసం యండమూరి 20 కథలు అందించారట.
ఒక దాంట్లో హీరో డామినేట్ చేస్తే మరో దాంట్లో హీరోయిన్ డామినేట్ చేసేది. చివరకు 20 కథలు విన్నాక కూడా చిరు, శ్రీదేవి కథను ఫైనలైజ్ చేయకపోగా, ఆ సినిమా అలానే ఆగింది. వజ్రాల దొంగ అనే టైటిల్ కూడా సినిమాకి ఫిక్స్ చేశారు. కాగా అప్పట్లో శ్రీదేవి కథలో మార్పులు చేయాలని చెప్పారట. హీరో రేంజ్ లోనే తన పాత్ర కూడా ఉండాలని చెప్పడంతో పాటు టైటిల్ కార్డ్ లో హీరో పక్కనే తన పేరును కూడా వేయాలని డిమాండ్ చేసేవారట. దాంతో మేకర్స్ సినిమాలో శ్రీదేవి స్థానంలో రాధను హీరోయిన్ గా తీసుకోగా, అలా తెరెక్కిన కొండవీటి దొంగ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత విజయం సాధించిందో మనం చూశాం. చిరు శ్రీదేవి కాంబోలో మోసగాడు, రాణికాసుల రంగమ్మ , జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలు వచ్చాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.