Gautam Gambhir fire on Virat Kohli
Virat Kohli : ప్రస్తుతం కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 212 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా టీం గెలుపుకి దగ్గరగా ఉంది. అయితే గ్రౌండ్‌లో చాలా ఆవేశంగా ఉండే విరాట్ కోహ్లీ మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్ పై చాలా ఆవేశంగా స్పందించాడు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.
అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాత బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించడంపై విరాట్ అండ్ టీమ్ అసహనం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా స్టంప్ మైక్ దగ్గరికి వెళ్లి, థర్డ్ అంపైర్‌పై కామెంట్లతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘టెక్నాలజీ మన చేతుల్లో ఉండదు. ఎల్బీడబ్ల్యూలో నాటౌట్‌గా తేలిన డీన్ ఎల్గర్, ఆ తర్వాత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు కదా.
Gautam Gambhir fire on Virat Kohli
‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్ స్టంప్స్ మైక్ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాకి కెప్టెన్‌గా ఉంటూ ఇలా చిన్నపిల్లల్లా ఛీటింగ్ చేస్తున్నారని ఆరోపించడం జనాలకు నచ్చకపోవచ్చు….’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ఈ వివాదంపై స్పందిస్తూ.. వికెట్ తీయాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఎల్గర్ డీఆర్‌ఎస్ కాల్‌తో తప్పించుకోవడం మింగుడుపడలేదని.. అందుకే ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నాడు.
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
This website uses cookies.