Gautam gambhir : సమష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినట్టు గంభీర్ తాజాగా చెప్పుకొచ్చారు. ఏ ఒక్కరి ప్రదర్శన వల్లో ఈ పరాజయం ఎదురవ్వలేదని, జట్టుగా విఫలమయ్యామని తెలిపాడు. సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకుంది. గంభీర్ వచ్చాక టీమిండియా జట్టు పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అందరు అనుకున్నారు. కాని పరిస్థితి భిన్నంగా ఉంది.
27 ఏళ్లలో తొలిసారిగా శ్రీలంకకు వన్డే సిరీస్ కోల్పోయింది.. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలోఘోర పరాభవం. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ సిరీస్ ఓటమి . ఇవి కొందరు స్టార్ ఆటగాళ్లకు పీడకలగా మారింది. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు. వారిద్దరిని రిటైర్ కావాలంటూ డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రోహిత్ మాత్రం తాను రిటైర్ కాబోనని అంటున్నాడు. అయితే, చివరి టెస్టులో ఓటమి అనంతరం గంభీర్ మీడియాతో మాట్లాడుతూ ఆటగాళ్ల భవిష్యత్తుపై తాను మాట్లాడబోనని అన్నాడు. కోహ్లి, రోహిత్ లో తపన, నిబద్ధత ఉంటే వారు భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానికి చేయాల్సింది చేస్తారని చెప్పాడు.
‘మీరు నిర్ణయం తీసుకోవాలి’ లేదా ‘మేం నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పడం. ఒకవేళ ఇద్దరు స్టార్లు ఏ విషయమూ చెప్పకుంటే వారిని తదుపరి ఎంపిక చేయడం కష్టమే. పైగా టీమ్ ఇండియా మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడేది జూన్ 20న. అయితే, ఈలోగా ముందుగా ఈ నెలలో ఇంగ్లండ్ తో టి20, వన్డే సిరీస్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ ఉంది. వన్డేలకు రోహిత్, కోహ్లిలను ఎంపిక చేస్తారా? లేదా? చూడాలి.కీలక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్ జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత పర్యటనకు రానుంది. అయితే ఈ సిరీస్‌ల ప్రారంభానికి ఇంకా 17 రోజుల సమయం ఉంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు దూరంగా ఉండనున్నాడు. ఫిబ్రవరి 6నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అప్పుడు షమీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
Makara sankranti : సనాతన సాంప్రదాయాలలో హిందూ సాంప్రదాయం ఒకటి. అటువంటి సాంప్రదాయంలో కొన్ని పండుగలు హిందువులు సాంప్రదాయంగా చేసుకుంటారు.…
South Stars Squid Game : కొరియన్ వెబ్ సీరీస్ స్క్విడ్ గేమ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది.…
Venkatesh : సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయ్ అంటే వాటి మధ్య భీకరమైన ఫైట్ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి బాలయ్య డాకు…
KTR : ఫార్ములా ఇ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి కెటి రామారావు (కెటిఆర్)…
HMPV Virus : “భారతదేశంలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కొత్తది కాదు,” అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి J.P.…
LPG Gas : కొత్త సంవత్సరంలోకి అడుగిన సందర్భంగా జనవరి 1, 2025 నుండి భారతదేశం అంతటా అనేక ముఖ్యమైన…
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan గేమ్ ఛేంజర్ సినిమా కు…
Cycling : ప్రస్తుత కాలంలో మానవాళి జీవితంలో ఒత్తిడితోను బిజీ అయిపోతున్నారు, అలాగే శారీరక శ్రమ ఏమాత్రం లేదు. కూర్చున్న…
This website uses cookies.