India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026 దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 15 February 2026, 10:43 pm
  •  India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026 దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

India vs Pakistan T20 World Cup 2026 : కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా Team India మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను Pakistan 61 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, టీ20 ప్రపంచ కప్ 2026  T20 World Cup 2026 సూపర్-8 Super 8 దశకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ విధ్వంసం, ఆపై బౌలర్ల సమష్టి కృషితో భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.

India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026: దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

India vs Pakistan T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026: దాయాదిపై దండయాత్ర.. పాక్‌పై 61 పరుగుల తేడాతో భారత్ జయభేరి

India vs Pakistan T20 World Cup 2026 : ఇషాన్ కిషన్ విధ్వంసం – అభిషేక్ శర్మ నిరాశ

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు India  ఆరంభంలోనే షాక్ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ Abhishek Sharma కేవలం 4 బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. సల్మాన్ అలీ ఆఘా బౌలింగ్‌లో అభిషేక్ వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ Ishan Kishan పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. తిలక్ వర్మ (25)తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ Suryakumar Yadav 29 బంతుల్లో 32 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దగా, చివర్లో శివమ్ దూబే (27), రింకూ సింగ్ (11 నాటౌట్) మెరుపులతో భారత్ 175 పరుగుల పోరాడగలిగే స్కోరును సాధించింది.

కుప్పకూలిన పాకిస్థాన్ Pakistan Collapse

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్లు విఫలమవ్వగా, ఉస్మాన్ ఖాన్ (44) ఒక్కడే కాసేపు పోరాడాడు. బాబర్ ఆజం (5) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయడంతో కేవలం 18 ఓవర్లలోనే 114 పరుగులకు పాకిస్థాన్ ఆలౌట్ కావడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.

సూపర్-8 బెర్త్ ఖరారు Super 8 Qualification

ఈ విజయంతో గ్రూప్-Aలో భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్-8 రౌండ్‌కు అధికారికంగా అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరోవైపు, ఈ ఓటమితో పాకిస్థాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. తదుపరి మ్యాచ్‌లో నమీబియాపై గెలిస్తేనే వారికి ముందంజ వేసే అవకాశం ఉంటుంది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి