
India vs Pakistan : ఏంటి.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవడం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా?
India vs Pakistan : ఉత్కంఠభరితమైన ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత మరో రోలర్‌కోస్టర్ సీజన్‌ను చూసేందుకు అందరు సమాయత్తం అయ్యారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2, 2024న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. వార్షిక టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ అనే రెండు దేశాల్లో జరుగుతుంది. ఈ సీజన్‌లో 20 జట్లను ఐదు జట్లతో నాలుగు గ్రూపులుగా విభజించారు.ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఎనిమిది జట్లను నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ జూన్ 29న జరుగుతుంది.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈసారి లీగ్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచకప్ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా జూన్ 9న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజీ యుద్ధం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే, మైదానంలో ఈ మ్యాచ్‌ని చూసేందుకు అభిమానులు అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. అందుకు కారణం టిక్కెట్ రేట్స్ భారీగా పెంచడమే. భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు విక్రయం ప్రారంభమైన వెంటనే సేల్ అయిపోతుంటాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య పోరు జరిగినప్పుడు స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అవుతుంది. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోలేదని సమాచారం.
India vs Pakistan : ఏంటి.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవడం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా?
దీనికి కారణం ఈ మ్యాచ్ టిక్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఐసీసీ ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను మూడు ప్యాకేజీలలో ఉంచింది. వీటిలో డైమండ్ క్లబ్, ప్రీమియం క్లబ్ లాంజ్, కార్నర్ క్లబ్ ఉన్నాయి. డైమండ్ క్లబ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అభిమానులకు అత్యుత్తమ సౌకర్యాలు లభిస్తాయి. అయితే దీనికి అభిమానులు రూ.8.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం క్లబ్ లాంజ్ టికెట్ ధర రూ. 2 లక్షలు, కార్నర్ క్లబ్ టికెట్ ధర రూ. 2.29 లక్షలు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ టిక్కెట్ ధరలను చాలా ఖరీదుగా మార్చింది. అయితే దీని టిక్కెట్లన్నీ ఇంకా అమ్ముడుపోకపోవడం షాక్‌కు గురిచేస్తుంది. మరి పరిస్థితుల బట్టైన రేట్లలో మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.