India vs Pakistan : ఏంటి.. భార‌త్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవ‌డం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India vs Pakistan : ఏంటి.. భార‌త్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవ‌డం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా?

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  India vs Pakistan : ఏంటి.. భార‌త్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవ‌డం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా?

India vs Pakistan  : ఉత్కంఠభరితమైన ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత మరో రోలర్‌కోస్టర్ సీజన్‌ను చూసేందుకు అంద‌రు స‌మాయ‌త్తం అయ్యారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2, 2024న తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. వార్షిక టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ అనే రెండు దేశాల్లో జరుగుతుంది. ఈ సీజన్‌లో 20 జట్లను ఐదు జట్లతో నాలుగు గ్రూపులుగా విభజించారు.ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఎనిమిది జట్లను నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ జూన్ 29న జరుగుతుంది.

India vs Pakistan  ఇంత దారుణ‌మా?

అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఈసారి లీగ్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. అనేక కారణాల వల్ల ఈ టీ20 ప్రపంచకప్ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా జూన్ 9న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే హైవోల్టేజీ యుద్ధం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే, మైదానంలో ఈ మ్యాచ్‌ని చూసేందుకు అభిమానులు అంత ఆస‌క్తి చూప‌డం లేద‌ని తెలుస్తుంది. అందుకు కార‌ణం టిక్కెట్ రేట్స్ భారీగా పెంచ‌డ‌మే. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య జరిగే మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు విక్రయం ప్రారంభమైన వెంటనే సేల్ అయిపోతుంటాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య పోరు జరిగినప్పుడు స్టేడియం మొత్తం హౌస్ ఫుల్ అవుతుంది. కానీ, ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కి సంబంధించిన అన్ని టిక్కెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోలేదని సమాచారం.

India vs Pakistan ఏంటి భార‌త్ పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవ‌డం లేదా ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా

India vs Pakistan : ఏంటి.. భార‌త్-పాక్ మ్యాచ్ టిక్కెట్స్ అమ్ముడుపోవ‌డం లేదా.. ఐసీసీ ప్లాన్ ఫెయిల్ అయిందా?

దీనికి కారణం ఈ మ్యాచ్ టిక్కెట్ ధర చాలా ఎక్కువగా ఉంది. ఐసీసీ ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను మూడు ప్యాకేజీలలో ఉంచింది. వీటిలో డైమండ్ క్లబ్, ప్రీమియం క్లబ్ లాంజ్, కార్నర్ క్లబ్ ఉన్నాయి. డైమండ్ క్లబ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అభిమానులకు అత్యుత్తమ సౌకర్యాలు లభిస్తాయి. అయితే దీనికి అభిమానులు రూ.8.34 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం క్లబ్ లాంజ్ టికెట్ ధర రూ. 2 లక్షలు, కార్నర్ క్లబ్ టికెట్ ధర రూ. 2.29 లక్షలు. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐసీసీ టిక్కెట్‌ ధరలను చాలా ఖరీదుగా మార్చింది. అయితే దీని టిక్కెట్లన్నీ ఇంకా అమ్ముడుపోకపోవడం షాక్‌కు గురిచేస్తుంది. మ‌రి ప‌రిస్థితుల బ‌ట్టైన రేట్ల‌లో మార్పులు చేస్తారా లేదా అనేది చూడాలి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది