T20 World cup Squad : టీ20 వరల్డ్ కప్ కోసం పోటీ.. 15 స్థానాల కోసం 25 మంది ప్లేయర్స్.. వారికి ఛాన్స్ పక్కా..!
T20 World cup Squad : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. ఐపీఎల్‌లో మనదేశానికి చెందిన ఆటగాళ్లే కాక విదేశాలకి చెందిన వారు కూడా దుమ్ములేపేస్తున్నారు. ఇక ఐపీఎల్ పూర్తైన వెంటనే టీ20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. యూఎస్‌ఏ-వెస్టిండీస్‌లో జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ తమ జట్లను మే 1లోగా ప్రకటించాల్సి ఉంది. అయితే భారత జట్టు విషయానికి వస్తే.. ఐపీఎల్‌లో ఆటతీరును పరిగణనలోకి తీసుకుని పటిష్టమైన భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ పక్కా స్కెచ్ వేస్తుంది. రింకూ సింగ్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ వంటి వారు ఐపీఎల్‌లో అదరగొడుతుండగా, వారికి ప్రపంచ కప్‌లో ఛాన్స్ పక్కా అంటున్నారు.
T20 World cup Squad : టీ20 వరల్డ్ కప్ కోసం పోటీ.. 15 స్థానాల కోసం 25 మంది ప్లేయర్స్.. వారికి ఛాన్స్ పక్కా..!
అయితే ప్రపంచకప్ కోసం జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుంది? ప్రపంచకప్‌కు టీమ్ ఇండియా తరఫున ఎవరెవరిని బరిలోకి దింపుతుందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్న ఈ జట్టులో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఇక యశస్వి జైస్వాల్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ కోసం పోటీ పడుతున్నారు. ఇక ఫినిషర్‌గా రింకూ సింగ్‌కి అవకాశం దక్కవచ్చు. ఇక ప్రస్తుత ఐపీఎల్‌లో ముంబైకి కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు రంగాలలో తేలిపోతున్నాడు.
T20 World cup Squad : టీ20 వరల్డ్ కప్ కోసం పోటీ.. 15 స్థానాల కోసం 25 మంది ప్లేయర్స్.. వారికి ఛాన్స్ పక్కా..!
ఐపీఎల్‌లో ముంబైకి కెప్టెన్సీ వచ్చినప్పటి నుంచి పెద్దగా ప్రదర్శన కనబరచడం లేదు. ఐపీఎల్ 17వ సీజన్‌లో అతని ప్రదర్శన తర్వాత అతనిని తొలగించాలని డిమాండ్ కూడా ఉంది. మరోవైపు చెన్నై ఆల్ రౌండర్ శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో హార్ధిక్ స్థానాన్ని అతనికి అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఇద్దరూ స్పిన్ ఆల్ రౌండర్లు ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోనున్నారని తెలుస్తుంది. అయితే ఐపీఎల్‌లో అక్షర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఒక స్పిన్పర్‌తో వెళితే మాత్రం రవీంద్ర జడేజాకు అవకాశాలు పెరుగుతాయి. సంజూ శాంసన్ ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నాడు. మరి అతనిని ప్రపంచ కప్‌కి ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.