IPL 2022 : ఐపీఎల్ 2022 సిరీస్ ఎట్టకేలకు ముగిసింది.అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మ్యాచ్ మ్యాచ్‌కూ తమ స్థాయిని పెంచుకుంటూ.. ఆల్‌రౌండ్ షో అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపించిన గుజరాత్ టైటాన్స్ కప్ తీసుకొని వెళ్లింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఒత్తిడిని దరి చేరనీయకుండా బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించి వహ్వా అనిపించాడు. ఫైనల్లోనూ రాజస్థాన్ ప్రమాదకర త్రయం శాంసన్, బట్లర్, హెట్‌మయెర్‌లను పెవిలియన్‌కు చేర్చి వారి వెన్నువిరిచాడు. ఇక 131 పరుగుల సాధారణ ఛేదనలో పెద్దగా మెరుపులు లేకపోయినా టైటాన్స్ సునాయాసంగానే మ్యాచ్‌ను ముగించి సొంత గడ్డపై అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేజింగ్‌లోనే ఎక్కు విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమిపాలైంది.అమిత్‌షా విజయ సంకేతం కూడా పలు అనుమానాలకి తావిస్తుంది. లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిన నాలుగు సార్లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఏదేమైన శాంసన్ నిర్ణయం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
స్వల్ప ఛేదనే అయినా గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగానే సాగింది. తొలి ఓవర్‌లోనే జీవదానం లభించిన గిల్ తుదికంటా నిలిచి ఆదుకున్నాడు. మధ్య ఓవర్లలో హార్దిక్ అండగా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే సాహా (5)ను ప్రసిద్ధ్ క్లీన్‌బౌల్డ్ చేయగా, వేడ్ (8) కూడా నిరాశపర్చడంతో పవర్‌ప్లేలో స్కోరు 31/2 మాత్రమే. ఈదశలో గిల్, కెప్టెన్ పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మెకాయ్, చాహల్ ప్రమాదకరంగా బంతులు వేయడంతో వీరు ఆచితూచి ఆడారు. 12వ ఓవర్‌లో పాండ్యా 4,6తో జోరు పెంచడంతో 15 పరుగులు లభించాయి. 14వ ఓవర్‌లో చాహల్ చేతిలో పాండ్యా అవుటయ్యాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ ధనాధన్ బ్యాటింగ్‌తో మిగతా పనికానిచ్చాడు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.