IPL 2022 : క‌ప్ గెలిచిన గుజ‌రాత్‌.. మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ర‌చ్చ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL 2022 : క‌ప్ గెలిచిన గుజ‌రాత్‌.. మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ర‌చ్చ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :30 May 2022,3:30 pm

IPL 2022 :   ఐపీఎల్ 2022 సిరీస్ ఎట్ట‌కేల‌కు ముగిసింది.అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ మ్యాచ్‌ మ్యాచ్‌కూ తమ స్థాయిని పెంచుకుంటూ.. ఆల్‌రౌండ్‌ షో అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థులకు రుచి చూపించిన గుజరాత్‌ టైటాన్స్ క‌ప్ తీసుకొని వెళ్లింది. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ఒత్తిడిని దరి చేరనీయకుండా బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనూ రాణించి వహ్వా అనిపించాడు. ఫైనల్లోనూ రాజస్థాన్‌ ప్రమాదకర త్రయం శాంసన్‌, బట్లర్‌, హెట్‌మయెర్‌లను పెవిలియన్‌కు చేర్చి వారి వెన్నువిరిచాడు. ఇక 131 పరుగుల సాధారణ ఛేదనలో పెద్దగా మెరుపులు లేకపోయినా టైటాన్స్‌ సునాయాసంగానే మ్యాచ్‌ను ముగించి సొంత గడ్డపై అభిమానులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

IPL 2022 : ఏం జ‌రిగింది..

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ చేజింగ్‌లోనే ఎక్కు విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఓటమిపాలైంది.అమిత్‌షా విజ‌య సంకేతం కూడా ప‌లు అనుమానాల‌కి తావిస్తుంది. లీగ్ దశలో గుజరాత్ సాధించిన 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే గెలుపొందడం విశేషం. ఓడిన నాలుగు సార్లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఏదేమైన శాంస‌న్ నిర్ణ‌యం ఇప్పుడు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

IPL 2022 match gets so many doubts

IPL 2022 match gets so many doubts

స్వల్ప ఛేదనే అయినా గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభంలో నిదానంగానే సాగింది. తొలి ఓవర్‌లోనే జీవదానం లభించిన గిల్‌ తుదికంటా నిలిచి ఆదుకున్నాడు. మధ్య ఓవర్లలో హార్దిక్‌ అండగా నిలిచాడు. రెండో ఓవర్‌లోనే సాహా (5)ను ప్రసిద్ధ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయగా, వేడ్‌ (8) కూడా నిరాశపర్చడంతో పవర్‌ప్లేలో స్కోరు 31/2 మాత్రమే. ఈదశలో గిల్‌, కెప్టెన్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మెకాయ్‌, చాహల్‌ ప్రమాదకరంగా బంతులు వేయడంతో వీరు ఆచితూచి ఆడారు. 12వ ఓవర్‌లో పాండ్యా 4,6తో జోరు పెంచడంతో 15 పరుగులు లభించాయి. 14వ ఓవర్‌లో చాహల్‌ చేతిలో పాండ్యా అవుటయ్యాడు. త‌ర్వాత‌ డేవిడ్‌ మిల్లర్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో మిగతా పనికానిచ్చాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది