Home » Exclusive » Ms Dhoni Blasts Hardik Pandya For Hat Trick Of Sixes
Exclusive

Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 15, 2024, 11:22 am
Advertisement

Hardik Pandya : ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌రిగింది. చెన్నై, ముంబై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు కనబర్చిన ముంబై ఇండియన్స్.. చెన్నై చేతిలో చతికిల పడింది. 20 ప‌రుగుల తేడాతో ప‌రాజయం పాలైంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) సెంచరీతో చెలరేగినా కూడా ముంబై విజ‌య‌తీరాల‌కి చేరుకోలేక‌పోయింది. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌లో రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాట‌గా, చివ‌రి ఓవ‌ర్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని మూడు సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో ఆ జట్టు 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

Advertisement

ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ గా వ‌చ్చిన హార్ధిక్ జ‌ట్టుని గెలిపించ‌డం ప‌క్క‌న పెడితే ఆయ‌న వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న కూడా ఏమి బాలేదు. అటు బౌల‌ర్‌గా, ఇటు బ్యాట‌ర్‌గా ఏ మాత్రం రాణించ‌లేక‌పోతున్నాడు. ఆదివారం సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయానికి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమయ్యాడు. ఆఖరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ధాటికి చివరి నాలుగు బంతులకు పాండ్యా ఇచ్చిన 20 పరుగులే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయి. కేవ‌లం 4 బంతులే ఆడిన ధోనీ 6,6,6,2తో 20 పరుగులు పిండుకున్నాడు. ధోనిని కంట్రోల్ చేసి ఉంటే ముంబై ఇండియ‌న్స్ మంచిగా విజ‌యం ద‌క్కించుకునేద‌ని అంటున్నారు.

Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..!

Advertisement

ఇత‌ర బౌల‌ర్స్ ఉన్న‌ప్ప‌టికీ హార్ధిక్ త‌న సత్తా చూపించాల‌ని చివ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవ‌ర్‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే త‌న జ‌ట్టుని గెలిపించాల‌ని రోహిత్ క‌సిగా ఆడిన కూడా ఎవరి నుండి స‌హ‌కారం ద‌క్క‌క‌పోవ‌డంతో ముంబై ఓట‌మి పాల‌వ్వాల్సి వ‌చ్చింది. రోజు రోజుకి ముంబై ప‌రిస్థితి దారుణంగా మారుతుండ‌డంతో హార్ధిక్‌ని తప్పించి మ‌ళ్లీ రోహిత్‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా చేయ‌నున్నార‌నే టాక్ వినిపిస్తుంది. చేజింగ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న ముంబైని మతీష పతీరణ దెబ్బతీసాడు. ఒకే ఓవర్‌లో ఇషాన్, సూర్యను ఔట్ చేసిన అతను నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తిలక్ ఔటవ్వకపోయినా ఫలితం మరోలా ఉండేది

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి