Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..!

Hardik Pandya : ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌రిగింది. చెన్నై, ముంబై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు కనబర్చిన ముంబై ఇండియన్స్.. చెన్నై చేతిలో చతికిల పడింది. 20 ప‌రుగుల తేడాతో ప‌రాజయం పాలైంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) సెంచరీతో చెలరేగినా కూడా ముంబై […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,11:22 am

ప్రధానాంశాలు:

  •  Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..!

Hardik Pandya : ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్ జ‌రిగింది. చెన్నై, ముంబై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు కనబర్చిన ముంబై ఇండియన్స్.. చెన్నై చేతిలో చతికిల పడింది. 20 ప‌రుగుల తేడాతో ప‌రాజయం పాలైంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 105 నాటౌట్) సెంచరీతో చెలరేగినా కూడా ముంబై విజ‌య‌తీరాల‌కి చేరుకోలేక‌పోయింది. చెన్నై బ్యాట్స్‌మెన్స్‌లో రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాట‌గా, చివ‌రి ఓవ‌ర్‌లో మ‌హేంద్ర సింగ్ ధోని మూడు సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో ఆ జట్టు 207 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ గా వ‌చ్చిన హార్ధిక్ జ‌ట్టుని గెలిపించ‌డం ప‌క్క‌న పెడితే ఆయ‌న వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న కూడా ఏమి బాలేదు. అటు బౌల‌ర్‌గా, ఇటు బ్యాట‌ర్‌గా ఏ మాత్రం రాణించ‌లేక‌పోతున్నాడు. ఆదివారం సీఎస్‌కేతో జ‌రిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయానికి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యానే కారణమయ్యాడు. ఆఖరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ధాటికి చివరి నాలుగు బంతులకు పాండ్యా ఇచ్చిన 20 పరుగులే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించాయి. కేవ‌లం 4 బంతులే ఆడిన ధోనీ 6,6,6,2తో 20 పరుగులు పిండుకున్నాడు. ధోనిని కంట్రోల్ చేసి ఉంటే ముంబై ఇండియ‌న్స్ మంచిగా విజ‌యం ద‌క్కించుకునేద‌ని అంటున్నారు.

Hardik Pandya కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా

Hardik Pandya : కొంప‌ముంచిన హార్ధిక్ పాండ్యా.. మ‌నోడికి గుడ్ బై చెప్పే స‌మ‌యం వ‌చ్చేసిందా..!

ఇత‌ర బౌల‌ర్స్ ఉన్న‌ప్ప‌టికీ హార్ధిక్ త‌న సత్తా చూపించాల‌ని చివ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవ‌ర్‌లో భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. అయితే త‌న జ‌ట్టుని గెలిపించాల‌ని రోహిత్ క‌సిగా ఆడిన కూడా ఎవరి నుండి స‌హ‌కారం ద‌క్క‌క‌పోవ‌డంతో ముంబై ఓట‌మి పాల‌వ్వాల్సి వ‌చ్చింది. రోజు రోజుకి ముంబై ప‌రిస్థితి దారుణంగా మారుతుండ‌డంతో హార్ధిక్‌ని తప్పించి మ‌ళ్లీ రోహిత్‌ని ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా చేయ‌నున్నార‌నే టాక్ వినిపిస్తుంది. చేజింగ్‌లో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న ముంబైని మతీష పతీరణ దెబ్బతీసాడు. ఒకే ఓవర్‌లో ఇషాన్, సూర్యను ఔట్ చేసిన అతను నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మను కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తిలక్ ఔటవ్వకపోయినా ఫలితం మరోలా ఉండేది

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది