Sunrisers Hyderabad : ఇలా అయితే క‌ష్టం.. మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sunrisers Hyderabad : ఇలా అయితే క‌ష్టం.. మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2025,11:40 am

ప్రధానాంశాలు:

  •  Sunrisers Hyderabad : ఇలా అయితే క‌ష్టం.. మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌..!

Sunrisers Hyderabad : ఐపీఎల్ 2025లో IPL 2025 భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో Sunrisers Hyderabad  సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ముంబయి ఇండియన్స్ mumbai indians విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ లో ఆడిన ఏడు మ్యాచుల్లో ముంబయి జట్టుకు ఇది మూడో విజయం. మరోవైపు గత సీజన్ ఫైనలిస్ట్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ విజయ పరంపరను కొనసాగించలేకపోయింది. దీంతో ఐదవ ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆశలపై తీవ్ర దెబ్బ పడింది.

Sunrisers Hyderabad ఇలా అయితే క‌ష్టం మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌

Sunrisers Hyderabad : ఇలా అయితే క‌ష్టం.. మ‌రోసారి స‌న్‌రైజ‌ర్స్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌..!

Sunrisers Hyderabad క‌ష్ట‌మే..

163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్.. 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి బ్యాటర్లందరూ మంచి ప్రదర్శనే చేశారు. రియాన్ రికల్టన్ (23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 31 పరుగులు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 26 రన్స్), విల్ జాక్స్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 36 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 26 రన్స్) రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 40), ట్రావిస్ హెడ్ (29 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 28 పరుగులు) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇషాన్ కిషన్ (3 బంతుల్లో 2 పరుగులు) మళ్లీ నిరాశపరిచాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (21 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 19 పరుగులు) బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఫీల్డింగ్ లో బానే రాణించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 37 రన్స్) కాసేపు దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు .

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి