Mumbai Indians : ఐపీఎల్ సీజన్ 17 ఎట్టకేలకి మొదలైంది. ఆరంభ వేడుకలతో అట్టహాసంగా మొదలైన తొలి మ్యాచ్‌లో చెన్నై జట్టు ఆర్సీబీపై మంచి విజయం సాధించింది. అయితే ఈ సారి పోటీ మంచి రంజుగా ఉంటుందని అర్ధమైతుంది.అయితే ఐపీఎల్‌లో ఇప్పటికే ఐదు కప్పులు ముంబైకి అందించిన రోహిత్ శర్మ ఈ సారి కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా ఆడబోతున్నాడు. కెప్టెన్ మార్పు తర్వాత ముంబైపై ఫ్యాన్స్ కూడా గరంగరంగా ఉన్నారు. మరోవైపు రోహిత్- హార్ధిక్ మధ్య సఖ్యత తగ్గిందని ఈ సారి ముంబై గెలవడం కష్టమేనంటూ ఎవరికి నచ్చినట్టు వారు భావిస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ముంబైకి ఈ సారి ట్రోఫీ దక్కేలా చేస్తుందని టాక్ నడుస్తుంది. అదేంటంటే ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, చెన్నై మధ్య జరిగిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఒకసారి టోర్నీలోని ఫస్ట్ మ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య జరిగింది.
ఆ సీజన్ లో ముంబై ఇండియన్స్ కప్పు కొట్టేసింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి కూడా ముంబై గెలుస్తుందని అందరు అంటున్నారు. ఒకవేళ అదే సెంటిమెంట్ పునరావృతమైతే ముంబై ఇండియన్స్ ఆరో కప్పును కైవసం చేసుకోవడం పక్కా అని అంటున్నారు. అయితే రోహిత్- హార్ధిక్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నప్పటికీ ముంబై జట్టు అదరగొట్టడం ఖాయం అంటున్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ ఆడిన కూడా ముంబై మంచి విజయం సాధించడం ఖాయం అంటున్నారు. మరోవైపు రోహిత్‌పై కెప్టెన్సీ భారం పోయింది కాబట్టి మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపిస్తాడని.. ఇక అతడిని ఆపడం ఎవరి తరం కాదని కూడా చెబుతున్నారు.
మరోవైపు త్వరలో టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఇందులో రాణించడానికి రోహిత్‌కి ఐపీఎల్ చక్కగా ఉపయోగపడుతుంది. చాలా నెలలుగా రోహిత్ టీ20లకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఐపీఎల్‌ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆదివారం రోజు ముంబై టోర్నీలోని తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రతి
ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రోహిత్‌ని కెప్టెన్సీ నుండి తొలగించడంపై నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.