Home » Exclusive » Pakisthan Won Against Bangladesh In T20 World Cup 2022
Exclusive

Pakistan : బంగ్లాదేశ్ పై గెలిచి సెమీస్ కి చేరిన పాకిస్తాన్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: November 6, 2022, 1:37 pm
Advertisement

pakistan : T20 వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో పాకిస్తాన్ గ్రూప్ 2 లో సెమీ ఫైనల్ కి చేరుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 రన్స్ మాత్రమే చేయటం జరిగింది.దీంతో రెండో బ్యాటింగ్ కి 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లు 18.1 ఓవర్ లలో ఐదు వికెట్లు కోల్పోయి 128 రన్స్ చేదించి గెలుపొందారు. దీంతో సెమి ఫైనల్ చేరుకున్న పాకిస్తాన్ .. గ్రూప్ వన్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

Advertisement

ఇక నెదర్లాండ్ చేతిలో ఉదయం సౌత్ ఆఫ్రికా ఓటమి చెందటంతో.. ఇండియా నేరుగా సెమీఫైనల్ కి చేరుకోవడంతో .. గ్రూప్ వన్ లో.. ఇంగ్లాండ్ టీంతో తలపడనుంది. పాకిస్థాన్ విజయంలో మొహమ్మద్ రిజ్వాన్ (32 పరుగులు, 32 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ హారిస్ (31 పరుగులు, 18 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్స్‌లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (25 పరుగులు, 33 బంతుల్లో, 2 ఫోర్లు),

pakisthan-won-against-bangladesh-in-t20-world cup 2022

Advertisement

షాన్ మసూద్ (24 పరుగులు, 14 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పాత్ర పోషించారు. పాకిస్తాన్ బౌలర్ షాహిన్ అఫ్రిది బంగ్లాదేశ్ బ్యాట్స్ మాన్ లను ముప్పు తిప్పలు పెట్టి నాలుగు వికెట్లు తీసి.. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి