
Chennai Super Kings : నైట్ అంతా సిట్టింగ్‌లు వేస్తే ఎలా గెలుస్తారంటూ రైనా చురకలు.. ఎవరికి అంటే..!
Chennai Super Kings : టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఒకడు. ఇతను ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత రైనా కామెంటేటర్‌గా సందడి చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటాడు. తాజాగా రైనా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై కొన్ని సంచలన కామెంట్స్ చేశాడు. లేట్ నైట్ పార్టీలతో బిజీగా ఉండడం వల్లనే ఆ జట్టు ట్రోఫీలను అందుకోలేకపోతున్నాయని అన్నాడు.
గత 16 సీజన్లగా కప్‌ను సాధించాలనే కల ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీకి కప్ కొట్టడం కలగానే మారింది. ఎందుకు వారు ఆ కలని నెరవేర్చుకోలేకపోతున్నారనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. దానిపై రైనా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ”చెన్నై సూపర్ కింగ్స్ పార్టీలకు దూరంగా ఉంటుంది కాబట్టే ఆ జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. పార్టీలు చేసుకునే రెండు, మూడు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకోయింది అని రైనా ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రైనా కామెంట్ చేసిన తర్వాత హోస్ట్ మీరు ఆర్సీబీ గురించి చెబుతున్నారా అని రైనాను ప్రశ్నించాడు. దానికి రైనా బదులిస్తూ.. ”కాదు. టైటిల్ గెలవని కొన్ని జట్లు గురించి చెబుతున్నాను. వాళ్లు కచ్చితంగా హార్డ్ పార్టీస్ చేసుకుంటారు. కాని సీఎస్కే అలా చేయదు. అందుకే ఐపీఎల్‌లో అయిదు సార్లు విజేతగా నిలచింది. రెండు సార్లు ఛాంపియన్ లీగ్ ట్రోఫీలను గెలుచుకుంది.
Chennai Super Kings : నైట్ అంతా సిట్టింగ్‌లు వేస్తే ఎలా గెలుస్తారంటూ రైనా చురకలు.. ఎవరికి అంటే..!
ముంబై ఇండియన్స్ కూడా అయిదు ట్రోఫీలు సాధించింది.. వారు రాత్రంతా పార్టీ చేసుకుని కూర్చుంటే, ఆ తర్వాత రోజు ఎలా ఆడతారు? మే-జూన్ నెలల్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. లేట్ నైట్ పార్టీల వలన మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లను ఎలా ఆడగలరు? మేం భారత్ తరఫున కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నాం అనే విషయాన్ని మైండ్‌లో ఉంచుకోవాలి అని రైనా హితవు పలికాడు. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, స్వేచ్ఛగా ఉన్నాను కాబట్టి పార్టీలు చేసుకోవచ్చుఅ ని రైనా చెప్పాడు. ఇక ధోని గురించి మాట్లాడుతూ.. గ్లోబల్ స్టేజ్ వంటి టోర్నీలో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తు సమయంలో ధోనీ ఎంతో ఒత్తిడి ఫేస్ చేసినట్టు ఆయన తెలియజేశాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.