IPL 2024 : కోహ్లీ ఆగ‌యా.. ఈ సారి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడంటే.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

IPL 2024 : కోహ్లీ ఆగ‌యా.. ఈ సారి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడంటే.!

IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ కు అంతా సిద్ధ‌మైంది. మొద‌టి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్‌లో మంచి విజ‌యం సాధించాల‌ని అంద‌రు కోరుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ తిరిగి రావ‌డం, అలానే రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఉమెన్స్ జ‌ట్టు ట్రోఫీ గెలుచుకోవ‌డంతో ఈ సారి ఆర్సీబీ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 March 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  IPL 2024 : కోహ్లీ ఆగ‌యా.. ఈ సారి ఏ స్థానంలో బ్యాటింగ్ చేయ‌నున్నాడంటే..!

IPL 2024 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ కు అంతా సిద్ధ‌మైంది. మొద‌టి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్‌లో మంచి విజ‌యం సాధించాల‌ని అంద‌రు కోరుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న విరాట్ తిరిగి రావ‌డం, అలానే రాయల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఉమెన్స్ జ‌ట్టు ట్రోఫీ గెలుచుకోవ‌డంతో ఈ సారి ఆర్సీబీ మెన్ జ‌ట్టు మంచి జోష్‌లో కనిపిస్తుంది. అయితే ఈ సారి బ్యాటింగ్‌లో కూడా ప‌లు మార్పులు చేసి ట్రోఫీ ద‌క్కించుకోవాల‌ని క‌సి మీద ఉంది.

ఈ మ్యాచ్​లో ఓపెనింగ్ జోడీతో పాటు బౌలింగ్ యూనిట్​లోనూ కీల‌క మార్పులు చేసి క‌ప్ కొట్టాల‌ని భావిస్తుంది ఆర్సీబీ జ‌ట్టు. గ‌త సీజ‌న్‌లో ఫాఫ్ డుప్లెసిస్​తో కలసి సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయ‌గా, ఈ సారి ఆస్ట్రేలియా హిట్ట‌ర్ గ్రీన్‌తో క‌లిసి ఫాఫ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడ‌ని టాక్. ఇక ఫ‌స్ట్ డౌన్‌లో కోహ్లీ రానున్నాడు. ర‌జ‌త్ పాటిదార్ సెకండ్ డౌన్‌లో వ‌స్తాడ‌ని టాక్. ఇక ఆ త‌ర్వాతి స్థానాల‌లో మ్యాక్స్‌వెట్‌, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ ఆడతారని టాక్ నడుస్తోంది. ఇక బౌలింగ్ విష‌యంలోను ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌నున్నార‌ని స‌మాచారం. సిరాజ్ మెయిన్ బౌల‌ర్‌గా ఉండ‌నుండ‌గా, ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్ పేస్ బాధ్యతల్ని పంచుకుంటారు.

ఫస్ట్ ఛాయిస్ స్పిన్నర్​గా క‌ర‌ణ్ శర్మ ఉంటాడు.అయితే కోహ్లీ ఫ‌స్ట్ డౌన్ బ్యాటింగ్‌పై చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జూన్‌లో టీ20 వ‌రల్డ్ క‌ప్ ఉండ‌నుండ‌గా, దానికి విరాట్‌ని కూడా ఎంపిక చేసే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉంది. అందుకోస‌మే కోహ్లీని ఫ‌స్ట్ డౌన్‌లో దింపే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మ‌చారం. కాగా కోహ్లీ గ‌త రెండు నెల‌లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నారు. ఆయ‌న మ‌రోసారి తండ్రి కావ‌డంతో చాలా సంతోషంలో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో అద‌ర‌గొట్టిన కోహ్లీ స్వ‌దేశంలో జ‌రిగిన ఇంగ్లండ్ సిరీస్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. అనుష్క రెండో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డంతో ఆయ‌న లండ‌న్ వెళ్లాగా అప్ప‌టి నుండి అక్క‌డే ఉండి రీసెంట్‌గా ఇండియాకి వ‌చ్చాడు. ఇక మ‌ళ్లీ క్రికెట్‌తో బిజీ కానున్నాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది