Rohit Sharma : ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ఐపీఎల్‌లో గత కొన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడుతూ వస్తున్నాడు. కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందించిపెట్టాడు. అయితే ఈ సీజన్ మొదలవ్వడానికి ముందు ఫ్రాంచైజీ ఆయనని కెప్టెన్‌గా తొలగించడం హాట్ టాపిక్ అయింది.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు టీమ్ ప్రదర్శన కూడా అంత బాగోలేదు. దీంతో ఆయనని ముంబై ఇండియన్స్ బుజ్జగిస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ, రోహిత్ శర్మ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది. కారులో ఆకాశ్ అంబానీ, రోహిత్ శర్మ ఎందుకు కలిసి వెళుతున్నారు. ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా అని పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తన కెప్టెన్సీని తొలగించడంపై రోహిత్ కాస్త అసంతృప్తిగానే బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నాడు. అభిమానులు ఆ నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీ మ్యాచ్ సందర్భంగా తమ నిరసనను తెలియజేయడంతో పాటు హార్దిక్ పాండ్యాను విమర్శస్తున్నారు. కొందరు రోహిత్‌ని ముంబై ఇండియన్స్ జట్టు వదిలేసి రావాలని సూచిస్తున్నారు. వచ్చే ఏడాది రోహిత్ వేలంలోకి వస్తే ఆయనని తీసుకునేందుకు మిగతా ఫ్రాంచైజీలన్నీ సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్.. రోహిత్ శర్మను ట్రాన్స్‌ఫర్ విండో ద్వారా తీసుకోవాలని బావిస్తున్నామని ప్రకటించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనే టాక్ వినిపిస్తుంది. మెగా ఆక్షన్ నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మను మరో జట్టులోకి పంపేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.కెప్టెన్సీ మార్పుతోనే తమ జట్టు బ్రాండ్ వాల్యూకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన ఆ ఫ్రాంచైజీ ఓనర్స్.. రోహిత్ శర్మను బుజ్జగించి ఎలా అయిన తమ టీంలోనే ఉండేలా చేస్తుందని అంటున్నారు. అవసరమైతే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలను మళ్లీ తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని టాక్. అంతే కాదు తమ వ్యాపారాల్లో భారీ విలువైన షేర్లు ఇచ్చేందుకు కూడా సిద్దమైందని టాక్ వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.