Home » News » Rohit Sharma Form Gets So Many Doubts
News

Rohit Sharma : ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ‌ని పంప‌కండి.. కోచ్ సంచ‌ల‌న కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: October 27, 2022 1:12 pm
Advertisement

Rohit Sharma : ప్ర‌స్తుతం టీమిండియా టైటిల్ ఫేవ‌రేట్‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అడుగుపెట్టిన విషంయం తెలిసిందే. ఇటీవ‌ల పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ చూస్తే ఓపెన‌ర్స్ దారుణంగా నిరాశ‌ప‌రిచారు. కేవ‌లం విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ఇన్నింగ్స్ వ‌ల‌నే భార‌త్ చివ‌రి బంతికి విజయం సాధించింది.అయితే ఇటీవ‌ల రోహిత్ శ‌ర్మ ఫాం ఆందోళ‌న క‌లిగిస్తుంది. కొన్ని రోజులుగా కెప్టెన్ రోహిత్ శర్మ సరిగా రాణించడం లేదు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ… రోహిత్ శర్మ ఫామ్ ను కోల్పోవడం టీమిండియాను ఆందోళనకు గురి చేస్తోందని చెప్పారు

Advertisement

ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ ఫామ్ అని ఆయ‌న అన‌డంతో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గట్టుగా రోహిత్ ఆడటం లేదని చెప్పారు. రోహిత్ ఆడితే ఆ తర్వాత వచ్చే బ్యాట్స్ మెన్ సులువుగా బ్యాటింగ్ చేస్తార‌ని ఆయ‌న అన్నారు. వచ్చీ రాగానే హిట్టింగ్ చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. తదుపరి జరిగే మ్యాచ్ లలో తొలి 6 ఓవర్ల వరకు వికెట్ కోల్పోకుండా ఉండటం కీలకమని కూడా గ‌వాస్క‌ర్ అన్నాడు. అయితే రోహిత్ ఫామ్‌పై అతని చిన్నప్పటి కోచ్ దినేష్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Rohit Sharma form gets so many doubts

Advertisement

Rohit Sharma : ఫామ్ పై ఆందోళ‌న‌

రోహిత్ శర్మ కొంతకాలం ఇన్నింగ్ ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుందని, పవర్ ప్లేలో రోహిత్ శర్మ అవసరం జట్టుకు ఉందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన సహజ శైలిలో గేమ్ ఆడాలని సూచించాడు. ప్రస్తుతం రోహిత్ హైరిస్క్ గేమ్ ఆడుతున్నాడంటూ కీకల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన‌ప్పుడు రోహిత్ చాలా అగ్రెసివ్ గేమ్ ఆడాల‌ని భావిస్తున్నాడు. అయితే తాను అలా ఎందుకు భావిస్తున్నాడో తనకు తెలియట్లేదని, అతిగా దూకుడుగా ఆడటంలో తప్పు చేస్తున్నాడని తాను భావిస్తున్నట్లు దినేష్ లాడ్ అంచనా వేశారు. రోహిత్ శర్మ క్రీజ్‌లో ఎక్కువ సమయం గ‌డిపితే మంచి ప‌రుగులు వ‌స్తాయ‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి