Home » Entertainment » Athidi Movie Gets Flop Talk
Entertainment

Athidi Movie : అతిధి ఫ్లాప్ కావ‌డానికి గల కార‌ణాలు ఏంటంటే…!

Authored By
Sam C
The Telugu News | Updated on: October 27, 2022 1:27 pm
Advertisement

Athidi ;  సినిమా అంటే అందులో అన్ని రకాల నవరసాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ నవరసాలు నటించే నటీనటులను కాకుండా వీక్షించే ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. మొదటి నుండి చివరి వరకు సినిమా మొత్తం ఆసక్తిగా ఉండాలి. అలా ఉంటేనే ప్రేక్షకులు సినిమాపై ఆస‌క్తి చూపుతుంటారు.. లేదంటే అంతే సంగతి. ఫస్టాఫ్ బాగుండి సెకండాఫ్ బాలేకపోతే ప్రేక్షకుల దృష్టిలో ఆ సినిమా బోల్తా కొట్టినట్లే అవుతుంది.. ఇక ముఖ్యంగా సినిమా అంతా బాగుండి చివరికి క్లైమాక్స్ సమయంలో మెప్పించేలేకపోయినా కూడా సినిమా హిట్ కానట్లే అని చెబుతుంటారు. మ‌హేష్ బాబు న‌టించిన అతిథి చిత్రం భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు భారీ ఫ్లాప్‌గా నిలిచింది.

Advertisement

ఇది మ‌హేష్ అభిమానులని ఎంత‌గానో నిరాశ‌ప‌ర‌చింది. అతిథి చిత్రం 2007లో విడుదల కాగా, ఇందులో మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ సినిమాకు ముందు విడుదలైన మహేష్ బాబు సినిమా పోకిరి తెలుగు చలన చిత్ర రంగంలో సంచలనాత్మక విజయం సాధించగా, వెంటనే వచ్చిన సైనికుడు చిత్రం భాక్సాఫీస్ దగ్గర విఫలమైన నేపథ్యంలో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉండేవి. కాని చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావ‌డానికి ముఖ్య కార‌ణాలు క్లైమాక్స్, ఫ‌స్టాఫ్, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేక‌పోవ‌డం. ఈ కార‌ణాల చేత‌నే అతిథి చిత్రం ఫ్లాప్ అయింద‌ని అంటుంటారు.

athidi movie gets flop talk

Advertisement

Athidi Movie : ఈ కార‌ణం చేత‌నే..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇప్పటికే ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతుందని.. అటు పృథ్వీరాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి