Home » News » Rohit Sharma Serious On Hardik Pandya
News

Rohit Sharma : రోహిత్‌ని దారుణంగా అవ‌మానించిన హార్ధిక్.. ఓట‌మి అనంతరం హిట్‌మ్యాన్ సీరియ‌స్..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 25, 2024, 1:01 pm
Advertisement

Rohit Sharma : ముంబైకి ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శ‌ర్మ ఈ సారి కెప్టెన్‌గా కాకుండా ఆట‌గాడిగా బ‌రిలోకి దిగాడు. హార్దిక్ పాండ్య నాయ‌క‌త్వంలో ముంబై బ‌రిలోకి దిగింది. జీటీతో జ‌రిగిన‌ తొలి మ్యాచ్‌లో ఓట‌మి చెందింది. జట్టు యాజమాన్యం నుంచి హార్ధిక్‌కి చాలా మద్దతు ఉన్నప్పటికీ అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడిలో హార్దిక్ కాస్త త‌డ‌బ‌డిన‌ట్టు తెలుస్తుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా త‌న బౌలింగ్, బ్యాటింగ్, కెప్టెన్సీలో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో గుజ‌రాత్ జెయింట్స్‌పై ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేయ‌గా, ఆ స్కోరుని కూడా చేధించ‌లేక‌పోయింది ముంబై జ‌ట్టు

Advertisement

అయితే ఈ మ్యాచ్‌లో చాలా ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అంద‌రి దృష్టి హార్ధిక్, రోహిత్ పైనే ఉంది. ఒక‌వైపు రోహిత్‌ని కెప్టెన్సీ నుండి తొల‌గించి హార్ధిక్‌ని కెప్టెన్ చేయ‌డంతో తీవ్ర‌మైన నిర‌స‌న‌లు చేస్తున్న సమయంలో హార్ధిక్ గ్రౌండ్ లో రోహిత్‌ని దారుణంగా అవ‌మానించాడు. అస‌లు టీమిండియాలో స్థానం కోల్పోవ‌ల్సిన హార్ధిక్‌కి వ‌రుస అవ‌కాశాలు ఇచ్చి చాలా హెల్ప్ చేసిన రోహిత్‌ని బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేయించాడు పాండ్యా. కెరీర్ స్టార్టింగ్​లో తప్పితే ఎప్పుడూ బౌండరీ లైన్ దగ్గర రోహిత్ ఫీల్డింగ్ చేయలేదు. రోహిత్ 30 యార్డ్ సర్కిల్​ లోపలే ఎక్కువ‌గా ఉంటాడు. బౌలర్లకు దగ్గరగా ఉంటూ అవసరమైన స‌మ‌యంలో ప‌లు సూచ‌న‌లు చేస్తుంటాడు.

ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్స్ ఆట‌తీరుని గ‌మ‌నిస్తూ అందుకు సంబంధించి స్ట్రాటజీలు కూడా అమ‌లు చేస్తుంటాడు. కాని తాజా మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ ​ సలహాలు, సూచనల్ని వాడుకోకుండా త‌న‌కిష్టం వ‌చ్చిన‌ట్టు ప్ర‌వ‌ర్తించాడు.. 30 యార్డ్ సర్కిల్​లో ఉన్న హిట్​మ్యాన్​ను ఫోర్ లైన్ ద‌గ్గ‌ర‌కి పంప‌డ‌మే కాక అతనితో కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు కూడా సోష‌ల్ మీడియాలో కొన్ని వీడియోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఓ స‌మ‌యంలో ఫీల్డ్ మార్పు సూచనలను పట్టించుకోని రోహిత్ శర్మపై హార్దిక్ పాండ్యా గట్టిగా అరిచిన‌ట్టు కూడా వీడియోలో రికార్డ్ అయింది. బుమ్రాతో కూడా హార్ధిక్ చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు తెలుస్తుంది. కొత్త‌గా కెప్టెన్సీ అందుకున్న హార్ధిక్ ఇలా చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి