Home » Andhra Pradesh » Raghu Rama Krishnam Raju Un Happy With Not Getting Narasapuram Mp Ticket
andhra pradesh

Raghu Rama Krishnam Raju : నాకు టిక్కెట్ రాక‌పోవ‌డానికి కార‌ణం అదే.. జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతానన్న ర‌ఘురామ‌..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: March 25, 2024, 2:00 pm
Advertisement

Raghu Rama Krishnam Raju : 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన రఘురామ కృష్ణంరాజు ఏడాదిలోనే వైసీపీకి దూరం అయ్యారు. అయితే ఆయ‌న‌పై అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో మేనేజ్‌ చేయగలిగినా ఈ సారి పోటీ చేసే అవ‌కాశం కోల్పోయాడు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించిన 6 లోక్‌సభ స్థానాలలో నరసాపురం వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చోటు ద‌క్క‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మకు టికెట్ కేటాయించ‌డంతో ర‌ఘురామ‌రాజు మ‌న‌స్థాపం చెందారు. రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసిన రఘురామ చివరకు టిక్కెట్ ద‌క్కించుకోలేక‌పోవ‌డంతో ఆయ‌న శ్రేయాభాలాషులు కూడా ఆందోళ‌న చెందుతున్నారు.

Advertisement

అయితే నరసాపురం టికెట్‌ రానందుకు తన అభిమానులు ఏ మాత్రం మ‌న‌స్థాపం చెంద‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు. తాను ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌క‌పోయిన కూడా ఎన్డీయేనే విజ‌యం సాధిస్తుంద‌ని, చంద్ర‌బాబు అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని అన్నారు. ఎప్ప‌టికి రాజ‌కీయాల‌లోనే ఉంటాన‌ని చెప్పిన ర‌ఘురామ స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు తాను జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతాన‌ని చెప్పుకొచ్చారు. నరసాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా చేసింది జ‌గ‌నేన‌ని,ఆయ‌న‌పై త‌ప్ప‌క పోరాడ‌తాన‌ని అంటున్నారు ర‌ఘురామ‌. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు

Raghu Rama Krishnam Raju : నాకు టిక్కెట్ రాక‌పోవ‌డానికి కార‌ణం అదే.. జ‌గ‌న్‌కి త‌గిన గుణ‌పాఠం చెబుతానన్న ర‌ఘురామ‌..!

Advertisement

త‌న‌కి టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డంపై చాలా మంది ఆందోళ‌న చెంది త‌న‌కు ఫోన్స్‌, మెసేజ్‌లు చేస్తున్నార‌ని చెప్పిన ర‌ఘురామ ఎవ‌రు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. జ‌గన్ త‌న మతానికి చెందిన అధికారిని అడ్డం పెట్టుకొని, ఇక్కడి ప్రభుత్వ అధినేతలతో కుమ్మక్కై అక్ర‌మంగా అరెస్ట్ చేయించి జైల్లో న‌న్ను చంపించే ప్ర‌య‌త్నం చేసారని, దానిలో ఆయ‌న విఫ‌ల‌మయ్యార‌ని చెప్పుకొచ్చారు. తాత్కాలికంగా నాకు టిక్కెట్ రాకుండా జ‌గ‌న్ అడ్డుప‌డ్డారు, గత నాలుగేళ్లుగా జగన్‌ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేసిన ఇప్పుడు మూడు అడుగులు వెన‌క్కి వేస్తున్నాను. కాక‌పోతే రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కించ‌క‌పోతే నా పేరు ర‌ఘురామ‌రాజు కాద‌ని అన్నారు. కొందరు బీజేపీ నేతలకు జగన్‌కు ఉన్న సాన్నిహిత్యంతో నాకు టిక్కెట్ రాకుండా జ‌గ‌న్ అడ్డుప‌డ్డాడంటూ చెప్పుకొచ్చాడు. జ‌గ‌న్‌పై నా తిరుగుబాటు ఆగ‌దు అంటూ ర‌ఘురామ అన్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి