Sara Tendulkar : డోంట్ వర్రీ బేబీ.. శుభ్‌మన్ గిల్‌పై సారా టెండుల్కర్ షాకింగ్ ట్వీట్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: October 12, 2023, 12:00 pm

Sara Tendulkar : శుభ్‌మన్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మనోడు ఆల్ రౌండర్, ఓపెనర్. అందుకే.. ఆట ప్రారంభం అయ్యే ముందు గిల్ కు ఏదైనా అయితే భారత్ కు ఆదిలోనే కష్టాలు ఎదురవుతాయి. దానికి కారణం.. ఓపెనర్ గా శుభ్‌మన్ గిల్ బాగా రాణిస్తాడు. అయితే.. మనోడి ఆటతోనే కాదు.. డేటింగ్ రూమర్స్ తోనూ ఈ మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాడు. గిల్ సాదాసీదా అమ్మాయితో డేటింగ్ చేస్తే మనం పెద్దగా పట్టించుకునే వాళ్లం కాదు కానీ.. శుభ్‌మన్ గిల్ ఏకంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఇవి నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం గిల్ ఐసీసీ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. దానికి కారణం అతడికి డెంగ్యూ సోకడం.

నిజానికి.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ కోసం అందరు టీమ్ ప్లేయర్లతో పాటు గిల్ కూడా చెన్నైకి చేరుకున్నాడు. కానీ.. అక్కడే మనోడికి డెంగ్యూ సోకింది. దీంతో తొలి మ్యాచ్ లో గిల్ ఆడలేదు. అప్పటికీ గిల్ కు జ్వరం తగ్గలేదు. చివరకు మొన్న మంగళవారం గిల్ డిశ్చార్జ్ అయ్యాడు. అయినా అఫ్ఘనిస్థాన్ మ్యాచ్ లోనూ గిల్ ఆడలేదు. దీంతో శనివారం జరిగే పాకిస్థాన్ ఇండియా మ్యాచ్ లో అయినా గిల్ ఆడుతాడా? లేదా? అనేది ఇంకా కన్ఫమ్ కాలేదు. శుభ్‌మన్ గిల్ త్వరగా కోలుకొని మళ్లీ వరల్డ్ కప్ లో ఆడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. నువ్వేం టెన్షన్ పడకు.. బాధపడకు.. మళ్లీ రెట్టించిన ఫామ్ తో బరిలోకి దిగుతావు అంటూ శుభ్‌మన్ గిల్ కు ధైర్యం చెబుతున్నారు అభిమానులు.

sara tendulkar tweet on shubman gill

#image_title

Sara Tendulkar : డోంట్ వర్రీ బేబీ.. నువ్వు మళ్లీ బలంగా తిరిగివస్తావు అంటూ సారా ట్వీట్

ఇదంతా పక్కన పెడితే.. శుభ్‌మన్ గిల్ హెల్త్ కండిషన్ పై సారా టెండుల్కర్ పోస్ట్ పెట్టింది. శుభ్‌మన్ గిల్ ఫోటో పెట్టి డోంట్ వర్రీ బేబీ.. నువ్వు ఇంకా బలంగా తిరిగి వస్తావు అంటూ ఒక లవ్ ఎమోజీ కూడా పెట్టింది సారా. ఆ ట్వీట్ ను చూసి నెటిజన్లు తెగ సంబురపడిపోతున్నారు. వీళ్లు నిజంగానే డేట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది ఈ ట్వీట్ చూస్తుంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ.. అసలు ఆ ట్వీట్ చేసి సారా కాదని.. సారాకు అసలు ట్విట్టర్ అకౌంటే లేదని కొందరు అంటున్నారు. ఆ ట్వీట్ ఫేక్ అని తేల్చేశారు. దీంతో అసలు వీళ్ల మధ్య నిజంగానే లవ్ ఉందా? డేటింగ్ చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్నకు మరోసారి సమాధానం దొరకకుండానే ఆగిపోయింది.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp