T20 World Cup : ఆ ప్లేయర్ కోసం అక్షర్ పటేల్ బలి.. ఇదేక్కడి నిర్ణయం బీసీసీఐపై నెటిజన్లు ఫైర్..!
T20 World Cup : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమాల దృష్టి అంతా టీ-20 వరల్డ్ కప్‌పైకి మళ్లింది. ఈ క్రమంలోనే బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. అయితే, అందులో చేసిన మార్పుల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ మార్పులు ఏంటంటే..ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రికెటర్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా 2021 టీ 20 ప్రపంచ కప్ జట్టులో మార్పులపై డెసిషన్ తీసుకుంది బీసీసీఐ. ఇందుకుగాను క్రైటిరియా క్రికెటర్స్ పర్ఫార్మెన్స్. కాగా తుది జట్టులో అక్షర్ పటేల్ ప్లేస్‌లో శార్దూల్ ఠాకూర్‌కు చోటు లభించింది.
shardul thakur replaces akshar patel in T20 World Cup 2021
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. సెలక్టర్లు కావాలేనే చేశారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పదిహేను మ్యాచుల్లో పద్దెనిమిది వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్‌కు ప్రపంచకప్‌లో చోటు కల్పించడం సరైనదేనని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ అందుకుగాను అక్షర్ పటేల్ ను తప్పించాల్సిన అవసరం లేదంటున్నారు. టీమ్‌కు అవసరమైన టైంలో వికెట్స్ తీస్తూ, మ్యాచ్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్‌ను టీ 20 ప్రపంచకప్‌లో తీసుకోవచ్చని అంటున్నారు. కానీ ఈ క్రమంలోనే అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పించారని బీసీసీఐ సెలక్టర్లపై విమర్శలు చేస్తున్నారు.
T20 World Cup : ఒకరి కోసం మరొకరు బలి..!
shardul thakur replaces akshar patel in T20 World Cup 2021
స్పిన్ ఆల్ రౌండర్ అయినటువంటి అక్షర్ పటేల్‌ను జట్టు నుంచి తప్పించడమేనది సరికాదని మాజీ క్రికెటర్ సబా కరీమ్ అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సెకండ్ ఆఫ్‌లో పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో ఇవ్వనటువంటి రాహుల్ చాహర్, హార్దిక్ పాండ్యాను తప్పించకుండా అక్షర్ పటేల్‌ను ఎందుకు తప్పించారనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో పన్నెండు మ్యాచ్‌లు ఆడిన అక్షర్ పటేల్ పదిహేను వికట్లు తీశాడు. హర్దిక్ పాండ్యా కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని సబా కరీమ్ కామెంట్ చేశాడు. హార్దిక్ పాండ్యాను టీ 20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పిస్తారని చాలా మంది అనుకున్నారు. ఈ మేరకు ప్రచారం కూడా బాగానే జరిగింది. కానీ సెలక్షన్ కమిటీ హార్దిక్ పాండ్యాను సెలక్ట్ చేసింది. దీంతో సెలక్టర్లపై విమర్శలు వస్తున్నాయి.
