Home » News » Sl Vs Ind 3rd T20i Gambhir Memes Go Viral After Surya Rinku Turn Bowling Heroes
News

Suryakumar Yadav : చివ‌రి ఓవ‌ర్‌లో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన సూర్య‌.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 31, 2024, 1:00 pm
Advertisement
Suryakumar Yadav : శ్రీలంక‌తో జ‌రిగిన మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గ‌త రాత్రి మూడో టీ20 జ‌ర‌గ‌గా, ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించంది. సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా ఫ‌లితం రావ‌డం విశేషం.కుర్రాళ్ల అద్భుత పోరాటం, సూర్యకుమార్ యాదవ్ గొప్ప కెప్టెన్సీతో ఓటమి కోరల్లో నుంచి టీమిండియా బయటపడి గెలిచింది. అయితే ఆఖరి టీ20 సూపర్ ఓవర్‌కు దారి తీస్తుందని, టీమిండియా గెలుస్తుందని ఎవరూ ఊహించి ఉండ‌రు. అందుకు కార‌ణం లంక విజయానికి ఆఖరి 12 బంతుల్లో 9 పరుగులే అవసరమయ్యాయి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. అప్పుడు సూర్య కుమార్ తీసుకున్న నిర్ణ‌యం కూడా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

Suryakumar Yadav : సూర్య బౌలింగ్ ధ‌మాకా..

18వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ వైడ్లు అతిగా వేసి మొత్తంగా 12 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా బంతిని రింకూ సింగ్‌కు ఇచ్చాడు. అప్పటివరకు టీ20ల్లో రింకూ బౌలింగే చేసిన దాఖ‌లాలు లేవు. మరోవైపు సిరాజ్ మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మంచి లయలో ఉన్నా కూడా సూర్య కుమార్ రింకూ సింగ్‌ని బౌలింగ్‌కి తీసుకురావ‌డం ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్స్ తీయ‌డంతో మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో స‌మీక‌ర‌ణం ఆరు పరుగులుగా మారింది. సిరాజ్‌ చివరి ఓవర్ వేస్తాడని భావించారంతా.

Advertisement

కాని కెప్టెన్ సూర్య కుమార్ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. టీ20ల్లో అప్పటివరకు సూర్య కూడా బౌలింగ్ చేయలేదు. ఇదే తొలిసారి. కానీ మొదటి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సూర్య రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం. అయితే చివరి మూడు బంతులకు లంక 5 పరుగులు చేసి మ్యాచ్‌ను టైగా ముగించింది. ఇక సూప‌ర్ ఓవ‌ర్ జ‌ర‌గ‌డం బంతిని అందుకున్న సుందర్ మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఛేదనలో సూర్య మొదటి బంతికే బౌండరీ బాది భారత్‌కు ‘సూపర్’ గెలుపు అందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ చివరి ఓవర్‌ను ఒత్తిడిని త‌ట్టుకుంటూ అద్భుతంగా వేసి రెండు వికెట్స్ తీయ‌డంతో అంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి