Suryakumar Yadav : చివరి ఓవర్‌లో బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసిన సూర్య.. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా?
Suryakumar Yadav : సూర్య బౌలింగ్ ధమాకా..
18వ ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ వైడ్లు అతిగా వేసి మొత్తంగా 12 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ స్థితిలో సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా బంతిని రింకూ సింగ్‌కు ఇచ్చాడు. అప్పటివరకు టీ20ల్లో రింకూ బౌలింగే చేసిన దాఖలాలు లేవు. మరోవైపు సిరాజ్ మూడు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మంచి లయలో ఉన్నా కూడా సూర్య కుమార్ రింకూ సింగ్‌ని బౌలింగ్‌కి తీసుకురావడం ఒకే ఓవర్‌లో రెండు వికెట్స్ తీయడంతో మ్యాచ్ ఇండియా వైపు తిరిగింది. ఆఖరి ఓవర్‌లో సమీకరణం ఆరు పరుగులుగా మారింది. సిరాజ్ చివరి ఓవర్ వేస్తాడని భావించారంతా.
కాని కెప్టెన్ సూర్య కుమార్ బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. టీ20ల్లో అప్పటివరకు సూర్య కూడా బౌలింగ్ చేయలేదు. ఇదే తొలిసారి. కానీ మొదటి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా సూర్య రెండు వికెట్లు పడగొట్టడం గమనార్హం. అయితే చివరి మూడు బంతులకు లంక 5 పరుగులు చేసి మ్యాచ్‌ను టైగా ముగించింది. ఇక సూపర్ ఓవర్ జరగడం బంతిని అందుకున్న సుందర్ మూడు బంతుల్లో రెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం ఛేదనలో సూర్య మొదటి బంతికే బౌండరీ బాది భారత్‌కు ‘సూపర్’ గెలుపు అందించాడు. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్‌ను ఒత్తిడిని తట్టుకుంటూ అద్భుతంగా వేసి రెండు వికెట్స్ తీయడంతో అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.