Sunil Gavaskar : ఐపీఎల్‌లో బౌలర్స్ కన్నా బ్యాట్స్‌మెన్ ఆదిపత్యం ఎక్కువగా ఉంది. ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌ని అయిన దడదడలాడిస్తున్నారు. ప్రతి సీజన్ కన్నా ఈ సీజన్‌లో బౌలర్స్‌ని దారుణంగా ఊచకోత కోశారు.ఇప్పటి వరకు జరిగిన 35 మ్యాచుల్లో.. 200 స్కోరు ఏకంగా 15సార్లు దాటిందంటే బ్యాటర్స్ విధ్వంసం ఏ రకంగా ఉందో అర్ధం చేసేకోవచ్చు. ఈ క్రమంలో లెజండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బౌలర్స్ కి అనుకూలంగా కొన్ని కామెంట్స్ చేశాడు. బౌలర్లపై ప్రతికూల ప్రభావం పడుతోందని, బీసీసీఐ ఇప్పటికైనా నేను చెప్పింది విని బీసీసీఐ తగు మార్పులు చేయాలని అన్నారు.. బౌండరీ రోప్స్‌ని కాస్త వెనక్కి జరపాలని సూచించాడు.
“బౌండరీ రోప్స్‌ని కాస్త వెనక్కి జరపాల్సిన అవసరం ఎంతైన ఉంది. చిన్న మైదానాల్లో ఇలా కచ్చితంగా చేస్తే బాగుంటుంది. అడ్వర్టైజింగ్ బోర్డులు.. రోప్స్‌కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటోంది కాబట్టి వాటిని కాస్త పెంచితే బాగుంటుంది. “క్రికెట్ బ్యాట్‌లో మార్పులు చేయాలని నేను చెప్పను. అన్నీ.. రెగ్యులేషన్స్ పరిధిలోనే ఉన్నాయి. కానీ.. బౌండరీ సైజులను కాస్త వెనక్కి జరపాలి. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతూ వస్తున్నాను. అయితే ఢిల్లీ మ్యాచ్ ఆడిన గ్రౌండ్ చూస్తే.. కొన్ని మీటర్ల వరకు వెనక్కి జరిపే అవకాశం ఉంది. ఆ స్పేస్ చాలా కీలకంగా మారుతుంది. ఎల్ఈడీ యాడ్ బోర్డ్‌ని ఇంకాస్త వెనక్కి జరపొచ్చు. బౌండరీ రోప్ని కూడా 2-3 మీటర్లు వెనక్కి జరిపితే చాలా చేంజ్ అవుతంది.
పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ వలన మంచి మజా రావచ్చు. కాని బ్యాటర్లు ఇలాగే కొట్టుకుంటూ వెళిపోతే క్రికెట్ బోర్ కొట్టేస్తుంది.. కచ్చితంగా బౌలర్స్, బ్యాటర్స్ మధ్య పోటీ అనేది ఉండాలి. కోచ్‌లు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టు అన్నట్టుగా ఉంది. బ్యాట్‌ని ఇష్టమొచ్చినట్టు తిప్పేస్తు ఆడేస్తున్నారు. ఔట్, నాటౌట్‌ని పట్టించుకోకుండా ఆడేస్తున్నారు. కొన్ని రోజుల వరకు ఇది బాగానే ఉంటుంది. కాని తర్వాత బోర్ వచ్చేస్తది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు సునీల్ గవాస్కర్. మరి దీనిని బీసీసీఐ స్వీకరిస్తుందా అనేది చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.