Sunil Gavaskar : బౌల‌ర్స్ బెంబెలెత్తిపోతున్నారు.. కొన్ని మార్పులు చేయ‌మంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సూచ‌న‌..1 | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sunil Gavaskar : బౌల‌ర్స్ బెంబెలెత్తిపోతున్నారు.. కొన్ని మార్పులు చేయ‌మంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సూచ‌న‌..1

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Sunil Gavaskar : బౌల‌ర్స్ బెంబెలెత్తిపోతున్నారు.. కొన్ని మార్పులు చేయ‌మంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సూచ‌న‌..1

Sunil Gavaskar  : ఐపీఎల్‌లో బౌల‌ర్స్ క‌న్నా బ్యాట్స్‌మెన్ ఆదిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌ని అయిన ద‌డ‌ద‌డలాడిస్తున్నారు. ప్ర‌తి సీజ‌న్ క‌న్నా ఈ సీజ‌న్‌లో బౌల‌ర్స్‌ని దారుణంగా ఊచ‌కోత కోశారు.ఇప్ప‌టి వ‌రకు జ‌రిగిన 35 మ్యాచుల్లో.. 200 స్కోరు ఏకంగా 15సార్లు దాటిందంటే బ్యాట‌ర్స్ విధ్వంసం ఏ ర‌కంగా ఉందో అర్ధం చేసేకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ బౌల‌ర్స్ కి అనుకూలంగా కొన్ని కామెంట్స్ చేశాడు. బౌలర్లపై ప్రతికూల ప్రభావం పడుతోందని, బీసీసీఐ ఇప్పటికైనా నేను చెప్పింది విని బీసీసీఐ త‌గు మార్పులు చేయాల‌ని అన్నారు.. బౌండరీ రోప్స్​ని కాస్త వెనక్కి జరపాలని సూచించాడు.

Sunil Gavaskar  : ప‌లు సూచ‌న‌లు చేసిన గ‌వాస్క‌ర్

“బౌండరీ రోప్స్​ని కాస్త వెనక్కి జరపాల్సిన అవ‌సరం ఎంతైన ఉంది. చిన్న మైదానాల్లో ఇలా కచ్చితంగా చేస్తే బాగుంటుంది. అడ్వర్టైజింగ్​ బోర్డులు.. రోప్స్​కి మధ్యలో చాలా గ్యాప్​ ఉంటోంది కాబ‌ట్టి వాటిని కాస్త పెంచితే బాగుంటుంది. “క్రికెట్​ బ్యాట్​లో మార్పులు చేయాలని నేను చెప్పను. అన్నీ.. రెగ్యులేషన్స్​ పరిధిలోనే ఉన్నాయి. కానీ.. బౌండరీ సైజులను కాస్త వెనక్కి జరపాలి. ఈ విష‌యాన్ని నేను ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్నాను. అయితే ఢిల్లీ మ్యాచ్ ఆడిన గ్రౌండ్ చూస్తే.. కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు వెన‌క్కి జ‌రిపే అవ‌కాశం ఉంది. ఆ స్పేస్ చాలా కీల‌కంగా మారుతుంది. ఎల్​ఈడీ యాడ్ బోర్డ్​ని ఇంకాస్త వెనక్కి జరపొచ్చు. బౌండరీ రోప్​ని కూడా 2-3 మీటర్లు వెనక్కి జరిపితే చాలా చేంజ్ అవుతంది.

Sunil Gavaskar బౌల‌ర్స్ బెంబెలెత్తిపోతున్నారు కొన్ని మార్పులు చేయ‌మంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సూచ‌న‌1

Sunil Gavaskar : బౌల‌ర్స్ బెంబెలెత్తిపోతున్నారు.. కొన్ని మార్పులు చేయ‌మంటూ సునీల్ గ‌వాస్క‌ర్ సూచ‌న‌..1

పవర్​ హిట్టింగ్​ బ్యాటింగ్ వ‌ల‌న మంచి మ‌జా రావ‌చ్చు. కాని బ్యాటర్లు ఇలాగే కొట్టుకుంటూ వెళిపోతే క్రికెట్​ బోర్​ కొట్టేస్తుంది.. క‌చ్చితంగా బౌల‌ర్స్, బ్యాట‌ర్స్ మ‌ధ్య పోటీ అనేది ఉండాలి. కోచ్‌లు కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్టు కొట్టు అన్న‌ట్టుగా ఉంది. బ్యాట్​ని ఇష్టమొచ్చినట్టు తిప్పేస్తు ఆడేస్తున్నారు. ఔట్​, నాటౌట్​ని పట్టించుకోకుండా ఆడేస్తున్నారు. కొన్ని రోజుల వ‌ర‌కు ఇది బాగానే ఉంటుంది. కాని త‌ర్వాత బోర్ వ‌చ్చేస్త‌ది అంటూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు సునీల్ గ‌వాస్క‌ర్. మ‌రి దీనిని బీసీసీఐ స్వీక‌రిస్తుందా అనేది చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది