T20 World Cup 2026 : సూపర్ 8లో ఆ మ్యాచ్‌లో వారి గురించే నా ఆందోళన : సూర్యకుమార్ షాకింగ్ స్టేట్మెంట్ ..!

 Authored By suma | The Telugu News | Updated on :21 February 2026,10:30 pm

ప్రధానాంశాలు:

  •  T20 World Cup 2026 : సూపర్ 8లో ఆ మ్యాచ్‌లో వారి గురించే నా ఆందోళన : సూర్యకుమార్ షాకింగ్ స్టేట్మెంట్ ..!

T20 World Cup 2026 : టీ20 ప్రపంచ క్రికెట్ Cricket వేడుకగా కొనసాగుతున్న T20 World Cup 2026 సూపర్-8 దశలో భారత జట్టు కూర్పు గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ Suryakumar Yadav చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జట్టు విజయ పరంపర కొనసాగుతున్న వేళ మార్పులు అవసరమా? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో Narendra Modi Stadium వేదికగా దక్షిణాఫ్రికాతో South Africa  భారత్ India కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ పోరుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూర్య జట్టు వ్యూహాలపై మాట్లాడాడు.

T20 World Cup 2026 : సూపర్ 8లో ఆ మ్యాచ్‌లో వారి గురించే నా ఆందోళన : సూర్యకుమార్ షాకింగ్ స్టేట్మెంట్ ..!

T20 World Cup 2026 : సూపర్ 8లో ఆ మ్యాచ్‌లో వారి గురించే నా ఆందోళన : సూర్యకుమార్ షాకింగ్ స్టేట్మెంట్ ..!

T20 World Cup 2026 : సూపర్-8లో మార్పులపై సందేహాలకు సమాధానం

ప్రస్తుతం జట్టులో మార్పులు చేసే ఆలోచన ఉందా? ముఖ్యంగా సంజూ శాంసన్‌కు Sanju Samson అవకాశం కల్పించేందుకు ఎవరినైనా తప్పిస్తారా? అనే ప్రశ్నకు సూర్యకుమార్ సమాధానం ఇచ్చాడు. జట్టు విజయవంతంగా ముందుకు సాగుతున్న సమయంలో కాంబినేషన్ మార్చడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశాడు. అభిషేక్ శర్మ లేదా తిలక్ వర్మ స్థానంలో మార్పు చేస్తారా? అని ప్రశ్నించగా “మేము గెలుస్తున్నాం. గెలుస్తున్న కాంబినేషన్‌ను తడబాటు లేకుండా కొనసాగించడం ముఖ్యం. ప్రతి మైదానం ప్రతి పిచ్ వేర్వేరు సవాళ్లు విసురుతున్నాయి. అయితే వాటిని ఎదుర్కొనేలా మా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి” అని సూర్య వివరించాడు. ఈ వ్యాఖ్యలతో జట్టు మేనేజ్‌మెంట్ ప్రస్తుత సమతుల్యతపై సంతృప్తిగా ఉందని అర్థమవుతోంది. ఫామ్, పరిస్థితులు, వ్యూహాలు అన్నీ సమన్వయం అయ్యేలా కూర్పు కొనసాగుతుందని కెప్టెన్ సంకేతాలు ఇచ్చాడు.

T20 World Cup 2026 : సంజూ శాంసన్ అవకాశాలపై స్పష్టమైన సంకేతాలు

సూపర్-8లో సంజూకు అవకాశం దక్కుతుందా? అనే చర్చ అభిమానుల్లో తీవ్రంగా కొనసాగుతోంది. అయితే సూర్య వ్యాఖ్యలు పరిశీలిస్తే, తుది జట్టులో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. టోర్నీలో ఇప్పటివరకు విజయాలు సాధించిన జట్టును మార్చడం ద్వారా అనవసర ఒత్తిడి తెచ్చుకోవడం ఇష్టం లేదనే భావన వ్యక్తమవుతోంది. జట్టు సమతుల్యత, బౌలింగ్-బ్యాటింగ్ కాంబినేషన్, ఫీల్డింగ్ ప్రమాణాలు అని కలిసి విజయాలకు కారణమని భావిస్తున్న మేనేజ్‌మెంట్, అదే ఫార్ములాను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

T20 World Cup 2026 : అభిషేక్ శర్మ ఫామ్‌పై కెప్టెన్ నమ్మకం

టోర్నీలో ఇప్పటివరకు పరుగుల ఖాతా తెరవలేకపోయిన అభిషేక్ శర్మ ఫామ్‌పై కూడా సూర్య స్పందించాడు. “అభిషేక్ ఫామ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతడి గురించి ఆందోళనపడే వారిపైనే నాకు ఆందోళన ఉంది” అని సరదాగా అన్నాడు. ప్రతి బ్యాటర్‌కీ ఇలాంటి దశ వస్తుందని, గత ఏడాది అతడు జట్టుకు ఎన్నో విజయాలు అందించాడని గుర్తుచేశాడు. ప్రస్తుతం అతనికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇదేనని సూర్య పేర్కొన్నాడు. “అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. అతడి ఆట శైలి అందరికీ తెలిసిందే. ప్రారంభంలోనే దూకుడుగా ఆడాలని చూస్తున్నాడు. ఒకసారి రిథమ్‌లోకి వస్తే అతన్ని ఆపడం కష్టం” అని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు రన్స్ రాకపోయినా, ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో పరిస్థితిని మార్చగల సామర్థ్యం అభిషేక్‌కు ఉందని కెప్టెన్ నమ్మకంగా చెప్పాడు. సూర్య మాటలు బట్టి చూస్తే సూపర్-8 దశలో పెద్ద మార్పులు ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మైదానంలో జరిగేది ఏంటో చూడాలి. కెప్టెన్ నమ్మకాన్ని యువ ఆటగాళ్లు నిలబెడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

suma

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి