IND VS PAK : ఇది కదా అసలైన కిక్ అంటే. మన చిరకాల ప్రత్యర్థిని మన గడ్డ మీద ఓడిస్తే వచ్చే కిక్కే వేరప్పా. ఇవాళ జరిగింది అదే. భారత్ సత్తా ఇది అని పాకిస్థాన్ కు మరోసారి టీమిండియా నిరూపించింది. అవలీలగా పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. 30 ఓవర్లలోనే మ్యాచ్ ను టీమిండియా ముగించేసింది. సొంత గడ్డపై భారత్ సత్తా ఏంటో చూపించింది. దాయాదికి చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే రెచ్చిపోయాడు. సెంచరీకి చేరువ అయ్యాడు. 86 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించి పెవిలియన్ చేరాడు. 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఆరు సిక్సులు, 6 ఫోర్లు కొట్టి ఒక్కసారిగా స్కోర్ ను పెంచాడు రోహిత్ శర్మ. ఇక.. ఇవాళే మ్యాచ్ కి ఎంట్రీ ఇచ్చిన శుభ్ మన్ గిల్ అంతగా ఆకట్టుకోలేదు. 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 16 పరుగులే చేశాడు.
30.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి టీమిండియా విజయం సాధించింది. ఇంకా 117 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో భారీ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ తర్వాత శ్రెయాస్ అయ్యర్ రాణించాడు. హాఫ్ సెంచరీ చేసి భారత్ కు సులువుగా విజయాన్ని అందించాడు. 62 బంతుల్లో శ్రెయాస్ అయ్యర్ 53 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 19 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఆఫ్రిది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ ఇప్పుడు మూడు మ్యాచులు వరుసగా గెలిచింది. ఇక పాయింట్ల విషయంలో చూస్తే భారత్ అత్యధిక పాయింట్లతో ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ లో టాప్ లో నిలిచింది.
పాక్ ను తన బౌలింగ్ తో కట్టడి చేసి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసిన బుమ్రాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించింది. ఇక.. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి టాప్ లో ఉన్న భారత్.. అక్టోబర్ 19న పసికూన బంగ్లాదేశ్ తో తలపడనుంది.
Birth Certificate : ఆంధ్రప్రదేశ్ లో ఈమధ్య అన్ని గుర్తింపు ధృవీకరణ పత్రాలు.. ప్రభుత్వ సేవలకు యాక్సెసింగ్ చాలా ఈజీ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్గా 12 వారాలు పూర్తి చేసుకోగా,…
Termites : సాధారణంగా ఇంట్లో చెదలు పట్టడం అనేది సాధారణమైన విషయం. అయితే ఈ చెదలు అనేవి చూడడానికి చిన్నగా ఉన్నా…
Siddharth Vs Allu Arjun : డిసెంబర్ 5న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 చిత్రం భారీ…
Vitamin D : మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ లలో విటమిన్ డీ కూడా ఒకటి. అయితే మన శరీరంలో…
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
This website uses cookies.