Virat kohli Anushka sharm : టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే మళ్ళీ రెండేళ్ల తర్వాత రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే అనుష్క రెండవ నెల గర్భిణీ అని తెలుస్తుంది. దీనికి కారణం ఆమె లైమ్ లైట్ కు దూరంగా ఉండడమే అని టాక్ వినిపిస్తుంది. కోహ్లీ టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఎప్పుడు తన భర్త అతడి టీంను ఉత్సాహ పరుస్తూ స్టేడియంలో సందడి చేసే అనుష్క గత కొన్ని మ్యాచ్ల నుంచి కనిపించడం లేదు.
బయట జరిగి టోర్నమెంట్లను ఎప్పుడు మిస్ చేయని అనుష్క ఈసారి ఎందుకనో వదులుకుంది. అయితే ఆ మధ్య విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ప్రసూతి హాస్పిటల్ లో కనిపించారట. కెమెరాలకు చిక్కకుండా చేయాలని చూసినా అది కుదరలేదట. అయితే కెమెరామెన్ లకు ఈ వీడియోను బయట పెట్టవద్దని కోరారట. అంతేకాకుండా రెండవ బిడ్డ గురించి అధికారికంగా ప్రకటన ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే అనుష్క కోహ్లీ దంపతులు ఇప్పటివరకు తమ మొదటి బిడ్డ వామిక ఫేస్ ని ఇంతవరకు రివీల్ చేయలేదు. వారు తమ కుమార్తె ఫోటోలను తీయవద్దని మీడియాకు చెప్పినట్లు కథనాలున్నాయి.
ఇప్పుడు రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జూనియర్ కోహ్లీ పుట్టాలని కోరుకుంటున్నారు. ఇకపోతే అనుష్క చక్దా ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగమైన మహిళ ఫేసర్లలో ఒకరైన జలక్ గోస్వామి జీవిత కథాంశంగా తెరకెక్కుతుంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఐదు సంవత్సరాల క్రితం తర్వాత అనుష్క శర్మకు కం బ్యాక్ మూవీగా నిలవనుంది.
Allu Arjun Biggest Cutout : పుష్ప 1 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప…
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
This website uses cookies.