Categories: Newssports

Virat Kohli : బీసీసీఐ కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..?

Advertisement
Published by
Advertisement

Virat Kohli : ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త నిబంధనలను అమలు చేసింది. భారత క్రికెట్‌లో మరింత క్రమశిక్షణ, ప్రదర్శన మెరుగుపరిచే లక్ష్యంతో 10 కీలక నిబంధనలను రూపొందించింది. ఇందులో క్రికెటర్ల కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. విదేశీ టూర్‌లకు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లవచ్చుగానీ, వారి గడువు పరిమితి ఉంటుంది. పొడవైన టూర్‌లలో రెండు వారాలు, తక్కువ వ్యవధి ఉన్న పర్యటనల్లో కేవలం ఒక వారం మాత్రమే వారితో గడిపే అవకాశం కల్పించింది.

Advertisement

Virat Kohli : బీసీసీఐ కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ అసంతృప్తి

Virat Kohli  బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఆగ్రహం

ఈ నిబంధనలపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ “కఠినమైన పరిస్థితుల్లో ఆటగాళ్లకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సమక్షం చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. క్రికెటర్లు కేవలం ఆట కోసం మాత్రమే కాకుండా, మానసిక శాంతిని పొందేందుకు కూడా ఫ్యామిలీతో గడిపే సమయం అవసరం. అయితే, కొందరు వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోలేరు. ఆటలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో కుటుంబ సభ్యుల సహాయాన్ని మరింతగా ఆశిస్తాం. కానీ ఈ పరిమితి ఆటగాళ్లను మానసికంగా ఒంటరితనానికి గురిచేస్తుంది” అని విరాట్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

ఇక ఆటకు సంబంధించిన బాధ్యతలు పూర్తయ్యాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తామన్న కోహ్లీ, తన కుటుంబంతో గడిపే సమయాన్ని ఎవరు నిరోధించకూడదని స్పష్టం చేశాడు. ఆటలో రాణించలేకపోతే ఒంటరిగా ఉండాలని ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలపై మరికొంతమంది క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo కొత్త సంచలనం.. S60 సిరీస్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యమే!

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…

41 minutes ago

RCB Vs GT Final : ఐపీఎల్ 2026 ఫైనల్ బిగ్‌ ఫైట్.. ఆర్‌సీబీ vs గుజరాత్ టైటాన్స్ … విజేత ఎవరు?

RCB Vs GT Final  : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…

2 hours ago

Zodiac Signs : అదృష్టం మీ వైపే ఉండాలంటే.. ఈ రాశివారు తప్పక పాటించాల్సిన సూచనలు..!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…

2 hours ago

Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఉంటే బీర్ తాగమంటారా? ఈ అపోహ వెనుక వాస్తవాలు ఇవే!

Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…

5 hours ago

Low-Calorie Snacks : ఎంత తిన్నా బరువు పెరగరు.. డైట్ చెడకుండా ఆకలి తీర్చే 10 ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే!

Low-Calorie Snacks :  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…

6 hours ago

Jr NTR : ఎన్టీఆర్ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్?.. త్రివిక్రమ్ మూవీపై పెరుగుతున్న అంచనాలు..!

Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…

15 hours ago

Balka Suman Arrest : బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు కారణమేంటి..?

Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…

16 hours ago

Parameshwar Reddy : ఉప్పల్‌లో కాంగ్రెస్ బలోపేతమే మా లక్ష్యం : మందుముల పరమేశ్వర్ రెడ్డి

హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…

17 hours ago

Union Cabinet Expansion : మోదీ 3.0లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?.. కొత్త వారికి చాన్స్ ఉందా..?

Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…

18 hours ago

Peddi Movie : భారీ అంచనాల మధ్య ‘పెద్ది’కి కొత్త సమస్యలు.. ఏమవుతుందో?

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…

19 hours ago

Pawan Kalyan : మాస్టర్ ప్లాన్.. ఏడాది ముందే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్..!

Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…

19 hours ago

OTT Movie : ప్రేమ, సస్పెన్స్, ట్విస్టులతో అదిరిపోయిన సినిమా.. OTTలో వైరల్ అవుతున్న థ్రిల్లర్ మూవీ..!

OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…

20 hours ago