Virat Kohli : బీసీసీఐ కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ అసంతృప్తి..?
ప్రధానాంశాలు:
Virat Kohli : బీసీసీఐ కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ అసంతృప్తి
Virat Kohli : ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త నిబంధనలను అమలు చేసింది. భారత క్రికెట్‌లో మరింత క్రమశిక్షణ, ప్రదర్శన మెరుగుపరిచే లక్ష్యంతో 10 కీలక నిబంధనలను రూపొందించింది. ఇందులో క్రికెటర్ల కుటుంబ సభ్యుల గురించి ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. విదేశీ టూర్‌లకు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లవచ్చుగానీ, వారి గడువు పరిమితి ఉంటుంది. పొడవైన టూర్‌లలో రెండు వారాలు, తక్కువ వ్యవధి ఉన్న పర్యటనల్లో కేవలం ఒక వారం మాత్రమే వారితో గడిపే అవకాశం కల్పించింది.

Virat Kohli : బీసీసీఐ కొత్త నిబంధనలపై విరాట్ కోహ్లీ అసంతృప్తి
Virat Kohli బీసీసీఐపై విరాట్ కోహ్లీ ఆగ్రహం
ఈ నిబంధనలపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ “కఠినమైన పరిస్థితుల్లో ఆటగాళ్లకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యుల సమక్షం చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. క్రికెటర్లు కేవలం ఆట కోసం మాత్రమే కాకుండా, మానసిక శాంతిని పొందేందుకు కూడా ఫ్యామిలీతో గడిపే సమయం అవసరం. అయితే, కొందరు వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోలేరు. ఆటలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో కుటుంబ సభ్యుల సహాయాన్ని మరింతగా ఆశిస్తాం. కానీ ఈ పరిమితి ఆటగాళ్లను మానసికంగా ఒంటరితనానికి గురిచేస్తుంది” అని విరాట్ అభిప్రాయపడ్డాడు.
ఇక ఆటకు సంబంధించిన బాధ్యతలు పూర్తయ్యాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తామన్న కోహ్లీ, తన కుటుంబంతో గడిపే సమయాన్ని ఎవరు నిరోధించకూడదని స్పష్టం చేశాడు. ఆటలో రాణించలేకపోతే ఒంటరిగా ఉండాలని ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీసీసీఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయాలపై మరికొంతమంది క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది.