
Virat Kohli comments on his India career
Virat Kohli : ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా టెస్ట్ సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో టీమిండియా గెలవగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. దీంతో సిరీస్ సమం అయింది. మూడో మ్యాచ్ రేపు జరగనుండగా, ఈ మ్యాచ్‌తో ట్రోఫీ ఎవరకి దక్కనుందనేది తెలియనుంది. అయితే గత మ్యాచ్‌కి అందుబాటులో లేని విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. అయితే అతను కొంత కాలంగా సెంచరీలు చేయకపోవడంపై తెగ విమర్శలు వస్తున్నాయి.2012-13 నుంచి శతకాల మోత మోగిస్తూ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేసేటట్లు కనిపించిన విరాట్ కోహ్లీ.. 2020, 2021లో ఏ ఫార్మాట్‌లోనూ కనీసం ఒక్కసారి కూడా 100 పరుగుల మార్క్‌ని అందుకోలేకపోయాడు.
దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ కోహ్లీ శతకం చేయలేకపోయాడు. కనీసం మూడో టెస్ట్ మ్యాచ్‌లో అయిన సెంచరీ అందుకుంటాడా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విరాట్ కోహ్లీ తన ఫామ్ గురించి మాట్లాడాడు.ఇలాంటి ఫామ్ నా కెరీర్‌లో తొలి సారి కాదు. 2014లోను ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్నాను. స్పోర్ట్స్‌లో ఎప్పుడు మనం అనుకున్నది జరగదు. జట్టుకి అవసరమైనప్పుడు ఒక బ్యాట్స్‌మెన్‌గా నేను ఎన్ని భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్నానేది ఇక్కడ ముఖ్యం’’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. 2019, నవంబరులో కోహ్లీ చివరిగా శతకం సాధించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఆ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
Virat Kohli comments on his India career
2009లో ఒక సెంచరీ సాధించిన కోహ్లీ.. 2010లో మూడు, 2011లో నాలుగు, 2012లో ఎనిమిది, 2013లో ఆరు, 2014లో ఎనిమిది, 2015లో నాలుగు, 2016లో ఏడు, 2017లో పదకొండు, 2018లోనూ పదకొండు, 2019లో ఏడు శతకాలు నమోదు చేశాడు. మొత్తంగా.. విరాట్ కోహ్లీ ఖాతాలో 70 ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే నిర్లక్ష్యపు షాట్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రిషభ్ పంత్‌ను వెనుకేసుకొచ్చాడు కోహ్లీ. కీలక సమయంలో ఫామ్‌లోకి వచ్చిన పుజారా, రహానేలను కొనియాడాడు. టెస్ట్ క్రికెట్ ప్రాముఖ్యతను వివరించాడు. ”నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. మహమ్మద్ సిరాజ్ మాత్రం మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా లేడు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.