Home » Entertainment » Controversy On Siddharth Tweet
Entertainment

Siddharth : సైనా నెహ్వాల్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన సిద్దార్థ్.. మండిప‌డుతున్న మ‌హిళ‌లు

Authored By
Sam C
The Telugu News | Published on: January 10, 2022, 9:00 pm
Advertisement

Siddharth :  త‌మిళ న‌టుడు సిద్దార్థ్ ఇటీవ‌ల సంచ‌ల‌న కామెంట్స్‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా మోదీ ప్ర‌భుత్వంపై ఆయ‌న చేసే కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. తాజాగా ఆయ‌న ప్ర‌ధాని మోదీకి మ‌ద్ద‌తుగా నిలిచినందుకు సైనా నెహ్వాల్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. దీంతో సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ డిమాండ్‌ చేశారు.

Advertisement

Siddharth సిద్ధార్థ్ ట్వీట్ దుమారం…

controversy on siddharth tweet

కొన్ని రోజుల క్రితం ప్రధాని మోడీ పంజాబ్​ టూర్​లో ఆయన కాన్వాయ్ భద్రతా వైఫల్యం ఎంతగా దుమారం రేపిందో మనంద‌రికి తెలిసిందే. దీనిపై సైనా నెహ్వాల్.. ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే అప్పుడు ఏ దేశం కూడా క్షేమంగా ఉండదు అంటూ జనవరి 5న ట్వీట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. ఈ ట్వీట్​కు హీరో సిద్ధార్థ రీట్వీట్ చేస్తూ.. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా (భారత్​ను రక్షించేవారు ఉన్నారని, కాక్ ఛాంపియన్​ ఆఫ్ ద వరల్డ్​ )అంటూ ట్వీట్ చేశాడు.

Advertisement

Siddharth : సిద్ధార్థ్ కామెంట్స్ పై పెద్ద దుమార‌మే చెల‌రేగింది. దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను తప్పబట్టింది. ‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్‌పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. ఒక స్త్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిద్దుపై మహిళా లోకం మండిపడుతోంది. దీనిపై చాలా మంది త‌మ అభిప్రాయం తెలియ‌జేస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఎక్క‌డి వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి