Categories: ExclusiveNewssports

Virat Kohli : ఇంత‌లా ప‌రువు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మా కోహ్లీ.. జ‌ట్టు నుండి త‌ప్పుకో అంటూ ఫైర్!

Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి కొన్నాళ్లుగా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో మాదిరిగా ఆడ‌డం లేద‌ని, తప్పుకుంటే బెట‌ర్ అని కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఈ వ‌రల్డ్ క‌ప్ విరాట్ కోహ్లీకి చివ‌రిది అని తెలుస్తుండ‌గా, ఇప్పుడు ఓపెనింగ్‌కి వ‌స్తున్నాడు. కెరీర్ మొదట్నుంచి ఫ‌స్ట్ డౌన్‌లో ఆడుతూ వస్తున్నాడు. ఫస్ట్ డౌన్​లో వచ్చి టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటోడు కీలకమైన టీ20 వరల్డ్ కప్​-2024లో ఓపెనింగ్​లో ఆడుతూ ప‌రుగులు రాబ‌ట్ట‌డానికి చాలా ఇబ్బంది ప‌డుతున్నాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్​లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. యూఎస్​ఏతో మ్యాచ్​లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే సూపర్-8లో 24, 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో మాత్రం అతడు పరువు తీసుకున్నాడు.

Virat Kohli పాపం.. కోహ్లీ

ఆసీస్​తో మ్యాచ్​లో మంచి ఇన్నింగ్స్​ ఆడి ఫామ్​లోకి వస్తాడనుకుంటే 5 బంతులు ఎదుర్కొన్న ఈ టాప్ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. జోష్ హేజల్​వుడ్ బౌలింగ్​ను సరిగ్గా అర్థం చేసుకోలేక చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కోహ్లీ ఔట్ అయిన ఇదే పిచ్​ మీద రోహిత్ భారీ షాట్లు బాదుతున్నాడు. వికెట్ బ్యాటింగ్​కు అనుకూలంగా ఉంది. అయినా కోహ్లీ రన్స్ చేసేందుకు చాలా ఇబ్బండి ప‌డ్డాడు. అత‌ని బ్యాటింగ్ తీరు చూసి చాలా మంది విమర్శ‌లు గుప్పించారు. ఇలాంటి ఆట ఆడి పరువు తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కింగ్​ను ఓపెనర్​గా ఆడించాలనేది అత్యాశ అని.. అతడు కూడా అదే కోరుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అత్యాశకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదని చెబుతున్నారు.

Virat Kohli : ఇంత‌లా ప‌రువు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మా కోహ్లీ.. జ‌ట్టు నుండి త‌ప్పుకో అంటూ ఫైర్!

ఇక ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మకు తోడుగా సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31), శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28)మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(2/45), మార్కస్ స్టోయినీస్(2/56) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసి ఓటమిపాలైంది. ట్రావిస్ హెడ్(43 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 76) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

Recent Posts

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

41 minutes ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

2 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

3 hours ago

Sabudana | నవరాత్రి ఉపవాసంలో సబుదాన ఎక్కువ తినొద్దు ..నిపుణుల హెచ్చరిక

Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…

4 hours ago

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

5 hours ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

6 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

15 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

16 hours ago